తెలంగాణ క్యాబినెట్‌లో.. ఉద్యోగుల డిమాండ్లపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది. కాగా ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పెండింగ్ డీఏలు చెల్లించాలని.. ఇతర బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కొద్ది రోజులుగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ లో ఉద్యోగులపై డిమాండ్లపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. కాళేశ్వరం కమిషన్, ఎన్డీఎస్ ఏ రిపోర్ట్, ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు పై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. నేటి క్యాబినెట్ సుధీర్ఘంగా వివిధ అంశాలపై చర్చిస్తున్నది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!