Stone of Destiny | చరిత్రను మలుపు తిప్పిన ఒక రాయి కథ..

Stone of Destiny విధాత‌: కింగ్ చార్లెస్‌కు జరుగుతున్న పట్టాభిషేకంలో ప్రతీ వస్తువు వెనక ఒక ఘనమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా అతి పవిత్రంగా భావించే 'స్టోన్ అఫ్ డెస్టినీ' రాయి అలాంటి వస్తువుల్లో ఒకటి. ఈ పురాతన పట్టాభిషేక రాయిని 'స్టోన్ అఫ్ స్కోన్' అని కూడా పిలుస్తారు. 152 కిలోల బరువుతో.. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే ఈ రాయిపై సిలువ ముద్ర ఉంటుందని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. బైబిల్ పాత నిబంధన ప్రకారం […]

Stone of Destiny | చరిత్రను మలుపు తిప్పిన ఒక రాయి కథ..

Stone of Destiny

విధాత‌: కింగ్ చార్లెస్‌కు జరుగుతున్న పట్టాభిషేకంలో ప్రతీ వస్తువు వెనక ఒక ఘనమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా అతి పవిత్రంగా భావించే ‘స్టోన్ అఫ్ డెస్టినీ’ రాయి అలాంటి వస్తువుల్లో ఒకటి. ఈ పురాతన పట్టాభిషేక రాయిని ‘స్టోన్ అఫ్ స్కోన్’ అని కూడా పిలుస్తారు. 152 కిలోల బరువుతో.. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే ఈ రాయిపై సిలువ ముద్ర ఉంటుందని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది.

బైబిల్ పాత నిబంధన ప్రకారం జాకబ్ అనే పాత్ర దానిపై తల పెట్టగానే ఆ రాయి పవిత్ర భూమి నుంచి బయలుదేరి ప్రపంచం అంతా చుట్టి ఐర్లాండ్‌కి చేరుకుంది. అలా క్రీస్తు శకం 700 ప్రాంతంలో ఐర్లాండ్ లోని టారా పర్వతంపై దానిని ప్రతిష్టించారు. అక్కడే ఆ దేశ రాజుల పట్టాభిషేకాలు జరిగేవి.

అనంతరం స్కాట్లాండ్ సేనలు ఐర్లాండ్ను ఆక్రమించి ఈ రాయిని స్వాధీనం చేసుకున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ రాయి స్కాట్లాండ్ లోని స్కోన్ అనే ప్రాంతానికి చెందినదని చెబుతున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం సైతం సుమారు తొమ్మిదో శతాబ్దం నుంచి ఇది స్కాట్లాండ్ రాజుల దగ్గరే ఉంటూ వస్తోంది.