NTR30: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా?
విధాత, సినిమా: ఎట్టకేలకు అతిలోకసుందరి శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రం ద్వారా ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. వాస్తవానికి జాన్వీ కపూర్‌ను అతిలోకసుందరి శ్రీదేవి మొదట కోలీవుడ్‌లో పరిచయం చేయాలని భావించింది. తర్వాత మాలీవుడ్.. తర్వాత టాలీవుడ్ ఇలా వరుసగా ఎంట్రీ ఇప్పించాలని భావించింది. ఇక ఇటీవల వరకు జాన్వీ కపూర్ తండ్రి బోనీకపూర్ కూడా […]
విధాత, సినిమా: ఎట్టకేలకు అతిలోకసుందరి శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రం ద్వారా ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.
వాస్తవానికి జాన్వీ కపూర్‌ను అతిలోకసుందరి శ్రీదేవి మొదట కోలీవుడ్‌లో పరిచయం చేయాలని భావించింది. తర్వాత మాలీవుడ్.. తర్వాత టాలీవుడ్ ఇలా వరుసగా ఎంట్రీ ఇప్పించాలని భావించింది. ఇక ఇటీవల వరకు జాన్వీ కపూర్ తండ్రి బోనీకపూర్ కూడా తన భార్య కోరికను తీర్చాలని భావించాడు.
కానీ బాహుబలి నుంచి మొత్తం సీన్ రివర్స్ అయింది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. వరల్డ్ వైడ్ మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నాయి. కానీ శ్రీదేవి బతికున్న కాలంలోనే బాహుబలి విడుదలైనప్పటికీ ఆమె బతికున్న కాలంలో తెలుగు చిత్రాలు ఈ స్థాయిలో హవా చూపలేదు.
కానీ ప్రస్తుతం మాత్రం బాలీవుడ్, కోలీవుడ్‌లకంటే టాలీవుడ్‌లో ఎక్కువ పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతున్నాయి. ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

ఇండియన్ మార్కెట్‌ను ప్రస్తుతం టాలీవుడ్ ఏలుతోంది. టాలీవుడ్ ఇతర భాషల సినిమాలతో పోల్చితే.. దేశంలోనే నెంబర్‌వన్ పరిశ్రమగా కొనసాగుతోంది. ప్రతిభావంతులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న వారు ఇక్కడ ఉన్నారు.
She’s the calm in the storm from the fierce world of #NTR30 ❤️
Happy Birthday and welcome onboard #JanhviKapoor
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram