‘మంత్రి’ భోజనం చేసిన విద్యార్థులు

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గూడూరు బీసీ స్కూల్లో సహపంక్తి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: 'మంత్రి' భోజనం చేసే అవకాశం హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మహాత్మా జ్యోతి బా పూలే బీ.సీ.వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం లభించింది. అదేంటి వెజ్, నాన్ వెజ్ భోజనాలు ఉంటాయి కానీ, ఈ మంత్రి భోజనం ఏంటంటారా? ఏమీ లేదూ. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మంగళవారం చేపట్టిన […]

‘మంత్రి’ భోజనం చేసిన విద్యార్థులు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
  • గూడూరు బీసీ స్కూల్లో సహపంక్తి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘మంత్రి’ భోజనం చేసే అవకాశం హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మహాత్మా జ్యోతి బా పూలే బీ.సీ.వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం లభించింది. అదేంటి వెజ్, నాన్ వెజ్ భోజనాలు ఉంటాయి కానీ, ఈ మంత్రి భోజనం ఏంటంటారా? ఏమీ లేదూ.

రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మంగళవారం చేపట్టిన పర్యటన సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భమో…లేక అధికారులో, పాఠశాల నిర్వాహకుల ప్రత్యేక శ్రద్ధో కానీ… విద్యార్థులతో కలిసి మంత్రి లంచ్ చేయడంతో వారికి మాత్రం విందు భోజనం లభించింది.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు కాకుండా కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్, వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎంపీ స్టేట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, రసమయి, రవి శంకర్, బాల్క సుమన్, సతీష్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, రమణ తదితరులంతా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మెనూలో నాలుగు కూరలు, స్వచ్ఛమైన బాటిల్ నీళ్ళు అందించారు. విద్యార్థులతో మంత్రుల పిచ్చపాటి సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. ప్రజాప్రతినిధులతోపాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర పోలీసు ఆఫీసర్లు, ఇతర అధికారులంతా విద్యార్థులతో కలిసి ‘మంత్రి’ భోజనం చేశారు.