‘Sulabh’ Bindeshwar | ‘సులభ్‌’ బిందేశ్వర్‌ మృతి

'Sulabh' Bindeshwar విధాత: బహిరంగ మలవిసర్జనపై యుద్ధం ప్రకటించి, పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ టాయ్‌లెట్లు నిర్మంచిన వ్యక్తి, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, విద్య ద్వారా సంస్కరణల కోసం ఆయన తన జీవితాంతం పనిచేశారు. ఉదయం స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన పాఠక్‌.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయారని ఆయన సిబ్బంది ఒకరు తెలిపారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు […]

‘Sulabh’ Bindeshwar | ‘సులభ్‌’ బిందేశ్వర్‌ మృతి

‘Sulabh’ Bindeshwar

విధాత: బహిరంగ మలవిసర్జనపై యుద్ధం ప్రకటించి, పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ టాయ్‌లెట్లు నిర్మంచిన వ్యక్తి, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, విద్య ద్వారా సంస్కరణల కోసం ఆయన తన జీవితాంతం పనిచేశారు.

ఉదయం స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన పాఠక్‌.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయారని ఆయన సిబ్బంది ఒకరు తెలిపారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాఠక్‌ మృతికి నివాళులర్పించారు.

బీహార్‌లోని వైశాలి జిల్లా రాంపూర్‌ బాఘేల్‌ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పాఠక్‌.. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొందారు. అశుద్ధాన్ని మోసే కార్మికుల హక్కుల కోసం పాటుపడ్డారు. వారిని ఆ కష్టం నుంచి తప్పించాలని చేసిన ఆలోచన నుంచే కమ్యూనిటీ టాయిలెట్లు వచ్చాయి.