Sunny Deol | వేలానికి సన్నీడియోల్ ఇల్లు

Sunny Deol బ్యాంకుకు బీజేపీ ఎంపీ 56 కోట్లు బకాయి పత్రికల్లో వేలం నోటీసు ఇచ్చిన బ్యాంకు న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన ముంబై నివాసం సన్నీ విల్లాను బ్యాంకు అధికారులు ఈ వేలం వేయనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు సన్నీడియోల్‌ 56 కోట్లు బకాయి పడ్డారు. వీటిని చెల్లించకపోవడంతో ఆయన ఇంటిని సెప్టెంబర్ 25న ఈ-వేలం వేయనున్నట్టు ప్రకటించారు. ఈ సొమ్మును 2016లో ఒక సినిమా కోసం అప్పుగా డియోల్‌ తీసుకున్నాడు. […]

  • By: Somu    latest    Aug 20, 2023 12:27 PM IST
Sunny Deol | వేలానికి సన్నీడియోల్ ఇల్లు

Sunny Deol

  • బ్యాంకుకు బీజేపీ ఎంపీ 56 కోట్లు బకాయి
  • పత్రికల్లో వేలం నోటీసు ఇచ్చిన బ్యాంకు

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన ముంబై నివాసం సన్నీ విల్లాను బ్యాంకు అధికారులు ఈ వేలం వేయనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు సన్నీడియోల్‌ 56 కోట్లు బకాయి పడ్డారు. వీటిని చెల్లించకపోవడంతో ఆయన ఇంటిని సెప్టెంబర్ 25న ఈ-వేలం వేయనున్నట్టు ప్రకటించారు. ఈ సొమ్మును 2016లో ఒక సినిమా కోసం అప్పుగా డియోల్‌ తీసుకున్నాడు.

అది గత ఏడాది డిసెంబర్‌ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. వేలం వేసే ముందు ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్‌ ప్రైస్‌గా నిర్ణయించింది. జుహులోని గాంధీగ్రామ్‌ రోడ్‌లో సన్నీ విల్లా ఉన్నది. ఇక్కడే సినీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టూడియో ‘సన్నీ సూపర్‌ సౌండ్‌’ కూడా ఉన్నది.

ఎంపీగా పూర్ రికార్డ్
మధ్యప్రదేశ్లోని గుర్దాస్పూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన సన్నీడియోల్.. ఇప్పటి వరకూ జరిగిన 12 సెషన్లలలో ఒకే ఒక్క ప్రశ్న అడిగినట్టు లోక్సభ రికార్డులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్కు చెందిన సునీల్ జక్కర్ను 2019 ఎన్నికల్లో సన్నీడియోల్ ఓడించారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి సన్నీడియోల్ను బీజేపీ నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

సగటున లోక్సభలో ఏటా 42.7 చర్చలు జరిగితే ఒక్క అంశంలోనూ ఆయన చర్చలో పాల్గొనలేదని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ రికార్డులు పేర్కొంటున్నాయి. గురుదాస్పూర్ నియోజకవర్గంలో ‘గుమ్షుదా’ (కనిపించడం లేదు) అని పోస్టర్లు కూడా వెలిశాయి. ఆఖరుకు ఇటీవలి అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా ఆయన పార్లమెంటుకు హాజరుకాలేదు.

పార్టీ సభ్యులందరూ విధిగా హాజరుకావాలని విప్ జారీ చేసినా.. ఆయన పార్లమెంటుకు రాలేదు. ఆ సమయంలో ఆయన తన తాజా సినిమా గదర్-2 ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 300 కోట్లు వసూలు చేసిందని చెబుతారు.

ఆయన తండ్రి, ఒకప్పటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కూడా బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ధర్మేంద్ర భార్య హేమామాలిని కూడా రెండు పర్యాయాలు బీజేపీ తరఫున మధుర నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.