సూపర్ స్టార్ VS ఐకాన్ స్టార్: కొత్త పంచాయితీ పెట్టిన గీతా ఆర్ట్స్
విధాత: ప్రతి హీరో ప్రతి మేకర్ టీజర్ ట్రైలర్లలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి అడ్డంగా బుక్కైపోతున్నారు. దాంతో ట్రోల్స్‌కి గురవుతుంటారు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ టీం నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. దాంతో వారు సినిమాను ఓ రేంజ్‌లో ఏకి పారేస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా, […]

విధాత: ప్రతి హీరో ప్రతి మేకర్ టీజర్ ట్రైలర్లలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి అడ్డంగా బుక్కైపోతున్నారు. దాంతో ట్రోల్స్‌కి గురవుతుంటారు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ టీం నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. దాంతో వారు సినిమాను ఓ రేంజ్‌లో ఏకి పారేస్తున్నారు.
మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లోకి వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి బజ్ క్రియేట్ అయింది.
సూపర్ స్టార్ VS ఐకాన్ స్టార్: కొత్త పంచాయితీ pic.twitter.com/TpILEROz7w
— vidhaathanews (@vidhaathanews) February 11, 2023
ఈ ట్రైలర్ చివరలో కిరణ్ అబ్బవరం ఓ డైలాగ్ చెప్పాడు. మనకు కష్టం వస్తే ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు నీ పక్క నెంబర్ సీఎంతో, పీఎందో, సచిన్‌దో, ధోనిదో, పవర్ స్టార్‌దో, ఐకాన్ స్టార్‌దో, రెబల్ స్టార్‌దో.. అనే డైలాగ్ చెప్పించారు. అయితే లిప్ నింపు సింక్‌లో మాత్రం సూపర్ స్టార్ అని అబ్బవరం పలుకుతుంటే దానిని కాస్త ఐకాన్ స్టార్‌గా మార్చి చెప్పించారు.
ఇదే ఇప్పుడు నెటిజన్ల ట్రోల్స్‌కి గురయ్యేలా చేస్తుంది. కిరణ్ అబ్బవరం సూపర్‌స్టార్ అని చెప్పిన డైలాగుని డబ్బింగ్‌కు వచ్చేసరికి ఐకాన్ స్టార్ అంటూ కవర్ చేశారు. దీంతో మహేశ్‌బాబు ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఐకాన్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలైంది