ఎన్నికల వేళ పార్టీలకు సుప్రీం షాక్‌

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పార్టీలకు షాక్ నిచ్చేలా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది

ఎన్నికల వేళ పార్టీలకు సుప్రీం షాక్‌
  • ఉచిత హామీల నిరోధక పిటిషన్ విచారిస్తాం


విధాత: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పార్టీలకు షాక్ నిచ్చేలా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత హామీలు తప్పు.. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలివ్వడం అనైతికం అంటూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. చీఫ్ జస్టీస్‌ డీ.వై. చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ విచారించాలని నిర్ణయించుకుంది. ఈ పిటిషన్‌ గురించి మేం మాట్లాడుకున్నామని,, ఇది చాలా ముఖ్యమైన విషయని, దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తామని ధర్మాసనం ప్రకటించింది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు మొదలవనున్న నేపథ్యంలో ఉచిత హామీల మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.


ఎన్నికల్లో పార్టీలు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీలను ప్రకటిస్తున్నాయి. అయితే ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం..అందుకే వీటిని వెంటనే నిషేధించాలని అంటూ సుప్రీంకోర్టులో పిటిష్ దాఖలైంది. ఉచిత హామీలను నిరోధించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని అభ్యర్ధించారు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్. అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని, రాజ్యాంగ స్ఫూర్తికీ విఘాతమని తెలిపారు. ప్రభుత్వ డబ్బును ప్రజలకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది లంచం కిందకు రాదా అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను రక్షించాలంటే వీటికి అడ్డుకట్ట వేయాల్సిందే నని పిటిషన్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ పిల్‌ మీద విచారణ జరిపించాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.