Rajasthan | 20 ఏళ్ల టీచ‌ర‌మ్మ‌తో వెళ్లిపోయిన 17 ఏళ్ల విద్యార్థిని.. ల‌వ్ జిహాద్ అని ఆరోప‌ణ‌లు

Rajasthan విధాత‌: ఇర‌వై ఏళ్ల ఉపాధ్యాయురాలు, 17 ఏళ్ల విద్యార్థిని ప్రేమించుకుని పారిపోయిన (Eloped) ఘ‌ట‌న రాజ‌స్థాన్‌ (Rajasthan) లోని బిక‌నీర్ న‌గ‌రంలో జ‌రిగింది. ఇద్ద‌రం ప్రేమించుకున్నామ‌ని, త‌మను ప్ర‌శాంతంగా వ‌దిలేయాల‌ని ఇద్ద‌రూ వేడుకుంటున్న వీడియో రెండు రోజుల క్రితం బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మ‌రోవైపు ఇది ల‌వ్ జిహాద్ వ్య‌వ‌హార‌మ‌ని వివిధ వ‌ర్గాల నుంచి నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ జ‌రిగింది జూన్ 30న స్కూల్‌క‌ని ఉద‌యం 7:30కు బ‌యలుదేరిన విద్యార్థిని సాయంత్రం […]

  • By: Somu    latest    Jul 07, 2023 12:59 AM IST
Rajasthan | 20 ఏళ్ల టీచ‌ర‌మ్మ‌తో వెళ్లిపోయిన 17 ఏళ్ల విద్యార్థిని.. ల‌వ్ జిహాద్ అని ఆరోప‌ణ‌లు

Rajasthan

విధాత‌: ఇర‌వై ఏళ్ల ఉపాధ్యాయురాలు, 17 ఏళ్ల విద్యార్థిని ప్రేమించుకుని పారిపోయిన (Eloped) ఘ‌ట‌న రాజ‌స్థాన్‌ (Rajasthan) లోని బిక‌నీర్ న‌గ‌రంలో జ‌రిగింది. ఇద్ద‌రం ప్రేమించుకున్నామ‌ని, త‌మను ప్ర‌శాంతంగా వ‌దిలేయాల‌ని ఇద్ద‌రూ వేడుకుంటున్న వీడియో రెండు రోజుల క్రితం బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మ‌రోవైపు ఇది ల‌వ్ జిహాద్ వ్య‌వ‌హార‌మ‌ని వివిధ వ‌ర్గాల నుంచి నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ జ‌రిగింది

జూన్ 30న స్కూల్‌క‌ని ఉద‌యం 7:30కు బ‌యలుదేరిన విద్యార్థిని సాయంత్రం ఎంత సేపైనా ఇంటికి రాలేదు. దీంతో కంగారు ప‌డిన త‌ల్లిదండ్రులు జులై 1న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ కుమార్తెకు ప‌రిచయ‌మున్న 21 ఏళ్ల ఉపాధ్యాయురాలు, ఆమె ఇద్ద‌రు సోద‌రులపై విద్యార్థిని త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు. అదే రోజు కొంతసేప‌టి త‌ర్వాత త‌మ అమ్మాయీ క‌నిపించ‌డం లేద‌ని ఉపాధ్యాయురాలి కుటుంబ‌స‌భ్యులు ఫిర్యాదు చేశారు.

జూలై 3న వీరిద్ద‌రూ క‌లిసి మాట్లాడిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాము ఇద్ద‌రం ప్రేమ బంధంలో ఉన్నామ‌ని.. త‌మ‌ను ప్ర‌శాంతంగా వ‌దిలేయాల‌ని వారు అందులో విజ్ఞ‌ప్తి చేశారు. ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే బిక‌నీర్‌లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిని ల‌వ్‌జిహాద్‌ (Love Jihad) గా ఆరోపిస్తూ ఆరోజు అన్ని దుకాణాలు, వ్యాపార స‌ముదాయాల‌ను స్వ‌చ్ఛందంగా మూసేశారు. జులై 5న చెన్నై పోలీసులు వారిని గుర్తించ‌డంతో.. రాజ‌స్థాన్ పోలీసులు చెన్నై వెళ్లారు.

‘మాటీం ఒక‌టి చెన్నై వెళ్లింది. మైనర్ బాలిక‌ను రాజ‌స్థాన్ తీసుకొచ్చి స్టేట్‌మెంట్ న‌మోదు చేసుకుంటాం. మైన‌ర్‌ను ఇలా తీసుకెళ్ల‌డం నేరం కాబ‌ట్టి ఉపాధ్యాయురాలిపై కేసు న‌మోదు చేశాం, ఇందులో ఇంకేదైనా కిడ్నాప్‌, కుట్ర ఉంటే ఆ మేర‌కు కేసులు న‌మోదు చేస్తాం.

కాగా.. వీరిద్ద‌రూ గ‌త వారం రోజులుగా ప‌లు న‌గ‌రాల్లో తిరిగి ప్ర‌స్తుతం చెన్నై చేరుకున్న‌ట్లు స‌మాచారం ఉంది’ అని బిక‌నీర్ ఐజీపీ ఓం ప్ర‌కాశ్ వెల్ల‌డించారు. త‌మ పిల్ల‌ల‌ను ఎవ‌రు మ‌తం మారుస్తున్నారో… ఎవ‌రు త‌మ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను తుడిచిపెట్టాల‌ని చూస్తున్నారో అంతా తెలుస‌ని భాజ‌పా ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్య‌వ‌హారాన్ని అసెంబ్లీలో లేవ‌నెత్తుతాన‌ని పేర్కొన్నారు.