Zoom | జూమ్‌ సంచలన నిర్ణయం.. ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ..!

Zoom | వీడియో కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నది. గ్రెగ్‌ టూంబ్‌ను ప్రెసిడెంట్‌ పదవి నుంచి తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, గ్రెగ్‌ టాంబ్‌ తొలగింపునకు సంబంధించి ఎలాంటి కారణాలను కంపెనీ వెల్లడించలేదు. గ్రెగ్‌ టాంబ్‌ను 2022 జూన్‌లో ప్రెసిడెంట్‌గా నియమించిన కంపెనీ.. తొమ్మిది నెలల్లోనే పదవి నుంచి తొలగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో వైపు కొత్త ప్రెసిడెంట్‌ ఎవరనే విషయాన్ని సైతం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. […]

Zoom | జూమ్‌ సంచలన నిర్ణయం.. ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ..!

Zoom | వీడియో కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నది. గ్రెగ్‌ టూంబ్‌ను ప్రెసిడెంట్‌ పదవి నుంచి తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, గ్రెగ్‌ టాంబ్‌ తొలగింపునకు సంబంధించి ఎలాంటి కారణాలను కంపెనీ వెల్లడించలేదు. గ్రెగ్‌ టాంబ్‌ను 2022 జూన్‌లో ప్రెసిడెంట్‌గా నియమించిన కంపెనీ.. తొమ్మిది నెలల్లోనే పదవి నుంచి తొలగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో వైపు కొత్త ప్రెసిడెంట్‌ ఎవరనే విషయాన్ని సైతం వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా.. గ్రెగ్‌ టాంబ్‌ 2019లో జూమ్‌లో చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టారు. జూమ్‌లో చేరక ముందు గూగుల్‌లో విక్రయాలు, వర్క్‌ స్పేస్‌, జియో ఎంటర్‌ప్రైజెస్‌ విభాగాలకు వైస్‌ ప్రెసిడెంట్‌గా 2021, మే వరకు కొనసాగారు. గత నెలలో ఫిబ్రవరిలో జూమ్‌ 1300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉద్యోగస్తులను తొలగిస్తే.. చట్టప్రకారం సిబ్బందికి 16 వారాల పాటు వేతనం, హెల్త్‌కేర్‌ కవరేజీ, 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బోనస్‌, 6 నెలల పాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాయేతర దేశాల్లోని ఉద్యోగులకు ఆగస్ట్‌ 9వ తేదీ వరకు సమయం ఇచ్చింది.