Jana Reddy: తీన్మార్ మల్లన్నవి గాలి మాటలు.. నేను పట్టించుకోను

  • By: sr    latest    Mar 05, 2025 4:13 PM IST
Jana Reddy: తీన్మార్ మల్లన్నవి గాలి మాటలు.. నేను పట్టించుకోను

విధాత, వెబ్ డెస్క్ : కుల గణన (Caste Census)వ్యవహారంలో తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తనపై చేసిన విమర్శలన్ని గాలి మాటలని కాంగ్రెస్ సీనియర్ నేత(Senior Congress leader) కే.జానారెడ్డి(Jana Reddy) కొట్టిపారేశారు. తనపై మల్లన్న చేసిన విమర్శలను ప్రజలు అర్ధం చేసుకుంటారని…పాత్రధారులు దానిపై వివరాలు వెల్లడిస్తారన్నారు.

నన్ను తిట్టిన వారిని నేను పట్టించుకోనని..తప్పు చేసిన వాడిని క్షమించే గుణం నాదన్నారు. మల్లన్న గాలి మాటలు మాట్లాడం సరికాదన్నారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన విమర్శలను పార్టీ నేతలు, సీఎం ఎందుకు ఖండించడం లేదన్న మీడియా ప్రశ్నకు ఆ విషయంపై వారినే అడిగి తెలుసుకోవాలన్నారు.

తీన్మార్ మల్లన్న ప్రెస్‌మీట్‌ పెట్టుకుంటే ఏంది?.. ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి? అని తేలిగ్గా తీసిపారేశారు. రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిలు మారడం తరుచు సహజమేనని అది పార్టీ నిర్వాహణ ప్రక్రియలో భాగమన్నారు. ప్రస్తుతం నేను ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉన్నానన్నారు. ప్రభుత్వం, పార్టీ ఎవరైన నా సలహాలు అడిగితే ఇస్తానన్నారు.

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావు

నా ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమేనని సీడ‌బ్ల్యుసీ స‌భ్యులు వంశీచంద‌ర్ రెడ్డి అన్నారు. తాను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయమ‌న్నారు. నా గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలలో భాగంగానే మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచింద‌న్నారు.

కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీ గా పని చేసిన మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ అమ్ముడు పోయి బీజేపీ కి మద్దతు ఇచ్చిందన్నారు. అందుకే బీఆరెస్ డిపాజిట్ కోల్పోయింద‌న్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు త‌న‌ గెలుపు కోసం సమిష్ట కృషి చేశారని వంశీ చంద‌ర్‌ రెడ్డి తెలిపారు.