komati reddy venkatreddy: 100 మంది చంద్రబాబులు అడ్డొచ్చినా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
komati reddy venkatreddy: విధాత, హైదరాబాద్ : బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 100 మంది చంద్రబాబులు వచ్చినా ఈ ప్రాజెక్టును ముందు పోనివ్వబోమని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుల్లో కొట్లాడతామని.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సాధించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పుడు హరీశ్ రావు, కేటీఆర్ బనకచర్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును ముందుకు సాగనివ్వబోమని తెలిపారు.
హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే..
ఘోష్ కమిటీ ఎదుట హరీశ్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నాడని కోమటిరెడ్డి విమర్శించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో శ్రీశైలం టన్నెల్ పూర్తిచేసి నీళ్లు అందిస్తామన్నారు. సొంత బిడ్డే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నా.. కేసీఆర్ కు ఇంకా జ్ఞానోదయం కలగట్లేదని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల ఇండ్లు పూర్తి చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కలను నెరవేస్తుందని చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram