Journalist Accreditation | జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పెంపు
తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30, 2025 వరకు అమల్లో ఉంటుంది.

హైదరాబాద్, సెప్టెంబర్ 26(విధాత): జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకే అక్రిడిటేషన్ల గడువు ముగియడంతో ప్రభుత్వం మూడు నెలలు పొడగించింది. ఆ గడవు సెప్టెంబర్ 30తో పూర్తి కావస్తుండటంతో మరో మూడు నెలలు పెంచుతున్నట్లు వెల్లడించింది. అక్టోబర్, 1, 2025 నుంచి డిసెంబర్, 30, 2025 వరకు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రతి ఏటా కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాల్సిన ప్రభుత్వాలు గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్లనే కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జారీ చేయబడిన అక్రిడిటేషన్లనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటంతో విమర్శలకు తావిస్తోంది.