Telangana | ఉద్యోగ విరమణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితిలో ఏది ముందైతే అది తక్షణమే అమలు చేసి పదవి విరమణ పూర్తి చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో మార్చి 31 నుంచి రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే ఫైల్‌ను సీఎం ఆమోదం కోసం అధికారులు సీఎంవోకు పంపారు.
ఎన్నికల కోడ్ ఆమోదానికి ఆటంకంగా మారడంతో కోడ్ తొలగిన వెంటనే ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది. గత బీఆరెస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంలో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగ ఖాళీలు పెరిగి నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్న ఆశిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram