Megastar Chiranjeevi | ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు.. మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు ఆదేశం..!
Megastar Chiranjeevi | ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలని చిరంజీవి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జే శ్రీకాంత్‌బాబుతో పాటు పలువురు వేసిన […]
Megastar Chiranjeevi | ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలని చిరంజీవి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జే శ్రీకాంత్‌బాబుతో పాటు పలువురు వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని, అందులో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ విషయంపై ఏప్రిల్ 25న మరోసారి వాదనలు జరుగనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram