Avinash Reddy | అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు

విధాత‌: వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో ఊర‌ట ల‌భించింది. వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అంతకు ముందు తనపై చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరఫు […]

  • By: Somu |    latest |    Published on : Mar 10, 2023 10:02 AM IST
Avinash Reddy | అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు

విధాత‌: వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో ఊర‌ట ల‌భించింది. వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

అంతకు ముందు తనపై చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరఫు లాయర్ ఈ హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ జరుపుతోందని న్యాయ స్థానానికి తెలిపారు.