Telangana | తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. గురుకులాల కార్యదర్శిగా నవీన్ నికోలస్
Telangana విధాత: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా […]
Telangana
విధాత: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా వెంకటేశ్ ధోత్రే, ఖమ్మం అడిషనల్ కలెక్టర్‌గా అభిలాష్ అభినవ్, కామారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా మను చౌదరి,
జగిత్యాల అడిషనల్ కలెక్టర్‌గా దివాకర టీఎస్, నాగర్‌కర్నూల్ అడిషనల్ కలెక్టర్‌గా కుమార్ దీపక్, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్‌గా సీ ప్రియాంక, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్‌గా జే అరుణశ్రీ, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా బీ చంద్రశేఖర్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియామకం అయ్యారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియామకం అయ్యారు. గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా ఎస్ స్నేహ, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా అలగు వర్షిణి, క్రీడల సంచాలకులుగా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, పర్యాటక శాఖ సంచాలకులు గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉపకార్యదర్శిగా సత్య శారదా దేవీ,
తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పొట్రు గౌతమ్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram