Konda Surekha: పెంపుడు కుక్క మృతి.. మంత్రి సురేఖ కంటతడి

  • By: sr    latest    Mar 06, 2025 3:28 PM IST
Konda Surekha: పెంపుడు కుక్క మృతి.. మంత్రి సురేఖ కంటతడి

Konda Surekha

విధాత, వరంగల్: చాలామంది ప్ర‌జ‌లు నిత్యం త‌మ‌ చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాకుండా, మూగ జీవాల‌తోనూ భావోద్వేగభ‌రిత సత్సంబంధాలు నెరుపుతుంటారు. తాము అల్లారుమ‌ద్దుగా చూసుకుంటున్న‌వి ఓ క్ష‌ణం క‌నిపించ‌కున్నా, వాటికేమైనా అయినా విల‌విల‌లాడి పోతుంటారు. అలాంటి ఘ‌ట‌న‌లు చాలా చూశాం కూడా. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఘ‌ట‌నే ఎదురైంది. కానీ ఇక్క‌డ ఉన్న‌ది ఓ రాష్ట్ర మంత్రి కావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చాలా కాలంగా తమ ఇంట్లో అల్లారు ముద్దు పెంచుకుంటున్న‌పెంపుడు కుక్క‌ హ్యాపీ గురువారం ఆకస్మికం మ‌ర‌ణించింది. దీంతో తీవ్ర బాధకు లోనయిన మంత్రి కంటనీరు పెట్టారు. హ్యాపీతో తమకున్న అనుభూతుల‌ను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆపై అంతిమ సంస్కారాలు నిర్వహించారు.