పెళ్లిపీటలపైనే వధువుకు పురిటినొప్పులు.. పండంటి బిడ్డకు జన్మ

bride delivery a baby | విధాత: పెళ్లిపీటల పైకి వధువుకు పురిటి నొప్పులు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చదువుతున్నది వందకు వంద శాతం నిజం. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో ముందే శారరీకంగా కలుసుకున్నారు. ప్రియురాలు గర్భం దాల్చింది. సెకన్ల వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ.. వీడియో వైరల్ వివాహం జరిగిన తర్వాతే పిల్లలను కనాలన్న ఆలోచన రావడంతో.. ఆ ప్రేమికులు డెలివరీ గడువు […]

పెళ్లిపీటలపైనే వధువుకు పురిటినొప్పులు.. పండంటి బిడ్డకు జన్మ

bride delivery a baby | విధాత: పెళ్లిపీటల పైకి వధువుకు పురిటి నొప్పులు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చదువుతున్నది వందకు వంద శాతం నిజం. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో ముందే శారరీకంగా కలుసుకున్నారు. ప్రియురాలు గర్భం దాల్చింది.

సెకన్ల వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ.. వీడియో వైరల్

వివాహం జరిగిన తర్వాతే పిల్లలను కనాలన్న ఆలోచన రావడంతో.. ఆ ప్రేమికులు డెలివరీ గడువు కంటే ముందు పెళ్లి తేదీని ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి రోజే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ నూతన వధూవరులు సంతోషం వ్యక్తం చేశారు.

బీర్లకు అలవాటు పడ్డ కోతి.. మరి దొంగిలించి తాగేస్తోంది.. వీడియో వైరల్

వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్స్ లోని డోడ్రెట్చ్ సిటీకి చెందిన నికోల్, మార్క్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారరీకంగా దగ్గరయ్యారు. దీంతో నికోల్ గర్భం దాల్చింది. పెళ్లి తర్వాతే డెలివరీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు వివాహ తేదీని ఫిక్స్ చేసుకున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. వివాహ వేదిక వద్ద నికోల్, మార్క్ కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నికోల్, మార్క్ పెళ్లికి సిద్ధమయ్యారు. అంతలోనే వధువుకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తేదీ కంటే ఐదు వారాల ముందే నికోల్ ప్రసవించింది.

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వచ్చే సినిమాలివే

ఆస్పత్రిలోనే వివాహం..

పెళ్లి మండపం నుంచి అతిథులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. వివాహం జరిపించే మత పెద్దలు కూడా అక్కడికే వచ్చేశారు. ఆస్పత్రిలోని ప్రార్థనా మందిరంలో నికోల్, మార్క్ వివాహం జరిపించారు. వీరి వివాహ రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరిగింది. పెళ్లి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నికోల్, మార్క్ దంపతులకు అతిథులు డబుల్ కంగ్రాట్స్ చెప్పారు.

పిల్లిని రెచ్చగొట్టిన కాకి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..