Warangal | ప్రేమ వివాహం చేసుకున్నాడని ఇండ్ల దగ్ధం
Warangal వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో దారుణం గ్రామ సర్పంచ్ సూత్రధారి తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల పికెటింగ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాల పల్లిలో ఓ ప్రేమ వివాహం గ్రామంలో విద్వేషాన్ని సృష్టించింది. తన బిడ్డను వేరే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడని ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ప్రత్యర్ధుల ఇండ్ల దహనానికి పాల్పడడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు ఇండ్లను మంగళవారం రాత్రి దగ్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ […]

Warangal
- వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో దారుణం
- గ్రామ సర్పంచ్ సూత్రధారి
- తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల పికెటింగ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాల పల్లిలో ఓ ప్రేమ వివాహం గ్రామంలో విద్వేషాన్ని సృష్టించింది. తన బిడ్డను వేరే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడని ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ప్రత్యర్ధుల ఇండ్ల దహనానికి పాల్పడడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు ఇండ్లను మంగళవారం రాత్రి దగ్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన ఊరిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముందు జాగ్రత్తగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
స్థానికుల చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. ఇటుకాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కూతురు మండల కావ్య శ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కావ్యశ్రీ హసన్ పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, రంజిత్ నర్సంపేట పట్టణ పరిధి సర్వాపురంలోని ఓ బ్యాంకు ఏటీఎం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు.
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న కావ్యశ్రీ, రంజిత్ ఐదారు రోజులుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో వారు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న బాలిక తండ్రి హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిద్దరు సరెండర్ అయ్యారు. తన బిడ్డ కావ్యశ్రీని తనతో రమ్మని తండ్రి ఎంత బతిమిలాడినా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. వీరిద్దరూ వేరువేరు కులాలుగా చెందిన వారిగా సమాచారం. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన సర్పంచ్ రవీందర్ ఆగ్రహంతో రంజిత్ ఇంటితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు మిత్రుల ఇండ్లను దహనం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.