తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ దాడులు

తెలంగాణలో ఐటీ దాడులు పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం బీఆరెస్‌ తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలతో పాటు పాతబస్తీలోని పలు వ్యాపర సంస్థలపై ఐటీ సోదాలు చేపట్టింది

తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ దాడులు

విధాత : తెలంగాణలో ఐటీ దాడులు పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం బీఆరెస్‌ తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలతో పాటు పాతబస్తీలోని పలు వ్యాపర సంస్థలపై ఐటీ సోదాలు చేపట్టింది. రోహిత్‌రెడ్డికి చెందిన తాండూర్, హైదరాబాద్, మణికొండలోని ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.


తాండూర్ లోని పైలట్ ఇంట్లో 20 లక్షలను, రికార్డులను స్వాధీనం చేసుకుకున్నారు. సోదరుడి దగ్గర 24 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాలు, కింగ్స్ ఫంక్షన్‌హాల్స్‌, హోటల్స్ యజమానుల ఇండ్లు, కోహినూరు వ్యాపార సంస్థ యజమాని నివాసాల్లో సోదాలు సాగుతున్నాయి.