Bihar | సిగరెట్ తాగాడని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయులు.. బాలుడు మృతి !
పట్నా: తమ విద్యార్థి ధూమపానం చేస్తూ కనపడటంతో అతడి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని చావగొట్టిన ఘటన బిహార్ (Bihar)లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 ఏళ్ల ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు చంపారన్ జిల్లా మధుబన్ ప్రాంతానికి చెందిన బజరంగీ కుమార్.. శనివారం తన తల్లి ఫోన్‌ను రిపేర్ షాప్ నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. దారిలో హర్దియా వంతెన కిందకు వెళ్లి స్నేహితుడితో కలసి సిగరెట్ వెలిగించాడు. […]

పట్నా: తమ విద్యార్థి ధూమపానం చేస్తూ కనపడటంతో అతడి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని చావగొట్టిన ఘటన బిహార్ (Bihar)లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 ఏళ్ల ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు చంపారన్ జిల్లా మధుబన్ ప్రాంతానికి చెందిన బజరంగీ కుమార్.. శనివారం తన తల్లి ఫోన్‌ను రిపేర్ షాప్ నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. దారిలో హర్దియా వంతెన కిందకు వెళ్లి స్నేహితుడితో కలసి సిగరెట్ వెలిగించాడు.
అదే సమయంలో బజరంగీ కుమార్ చదువుతున్న పాఠశాల ఛైర్మన్ అక్కడకి వచ్చారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తర్వాత ఛైర్మన్, అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలుడి బంధువు.. ఇద్దరూ బాలుడిని పాఠశాలకు లాక్కెళ్లారు. అక్కడ పలువురు ఉపాధ్యాయులు బజరంగీపై పిడిగుద్దులు కురిపించారు. బెల్టులతో చావబాదారు. కాసేపటికి బాలుడు స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కాగా.. అక్కడ చికిత్స పొందుతూ బజరంగీ మరణించాడు. కుమారుడి మరణ వార్త విని బాలుడి తల్లి గుండెలవిసేలా రోదించారు. తమ కుమారుడి శరీరంపై తీవ్రగాయాలున్నాయని, ప్రైవేటు భాగాల్లోంచి రక్తం కారుతోందని ఆరోపించింది.
కాగా ఐదు రోజుల క్రితమే కూలీ పనుల కోసం బాలుడి తండ్రి పంజాబ్‌కు వెళ్లడం గమనార్హం. అయితే తాము కొట్టామన్న ఆరోపణలను పాఠశాల ఛైర్మన్ ఖండించారు. తన తల్లిదండ్రులకు సిగరెట్ విషయం చెబుతామనే భయంతో విషం తాగాడని తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదన్నారు.