Veeresham | టికెట్ నాదే.. గెలుపు నాదే: వేముల వీరేశం
Veeresham | విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ నాదే గెలుపు నాదేనని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నకిరేకల్‌లో వీరేశం తన జన్మదిన వేడుకలను వేలాదిమంది పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య తన రాజకీయ బల ప్రదర్శన అన్నట్లుగా బహిరంగ సభను తలపించే రీతిలో నిర్వహించిన సభలో ఘనంగా జరుపుకున్నారు. వేముల జన్మదిన వేడుకలకు 30 వేల మందికి పైగా […]
Veeresham |
విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ నాదే గెలుపు నాదేనని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం నకిరేకల్‌లో వీరేశం తన జన్మదిన వేడుకలను వేలాదిమంది పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య తన రాజకీయ బల ప్రదర్శన అన్నట్లుగా బహిరంగ సభను తలపించే రీతిలో నిర్వహించిన సభలో ఘనంగా జరుపుకున్నారు.
వేముల జన్మదిన వేడుకలకు 30 వేల మందికి పైగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరవ్వడం గమనార్హం. వేముల జన్మదిన వేడుకల్లో మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నాయకులు కంచర్ల కృష్ణారెడ్డిలు సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ తనకు పార్టీ టికెట్ ఇస్తారని నమ్మకం ఉందన్నారు. వీరేశం తన జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ కాన్వాయ్ తో ర్యాలీగా సాగి జన్మదిన వేడుకల సభకు హాజరయ్యారు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram