Manchiryala: ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడమే.. ఈ సమస్యలకు మార్గం: భట్టి విక్రమార్క
విధాత: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతకు నిరాశ మిగిలిందని సింగరేణిలో గతంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించి 42 వేలకు తీసుకు వచ్చారని రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదని ప్రభుత్వం సింగరేణి కార్మికులను కూడా మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు . మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో భీమారం మండలం దాంపూర్‌లో 18వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోటపల్లి మండలంలో ప్రతిరోజు […]

విధాత: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతకు నిరాశ మిగిలిందని సింగరేణిలో గతంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించి 42 వేలకు తీసుకు వచ్చారని రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదని ప్రభుత్వం సింగరేణి కార్మికులను కూడా మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు .
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో భీమారం మండలం దాంపూర్‌లో 18వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోటపల్లి మండలంలో ప్రతిరోజు వందలాది లారీల ఇసుక అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఇందులో ప్రభుత్వ పెద్దలకు హస్తం ఉందని పేర్కొన్నారు.
జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులను నిండా ముంచారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో కాలేశ్వరం బ్యాక్ వాటర్‌తో వేలాది ఎకరాల పంట భూములకు నష్టం జరిగిందని పేర్కొన్నారు .
30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి మూడేళ్లుగా ఫారెస్ట్ అధికారులు రానివ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కన్నీళ్లు ఇబ్బందులు లేని ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫారెస్ట్ రైట్ యాక్ట్ అమలు చేసి పోడు రైతులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు .
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇండ్లకే వచ్చి.. మీ సమస్యలు పరిష్కరించి భూమి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసి దుక్కి దున్నించి పంట పండించే వరకు అండగా ఉంటామని ఆయన అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో ఆర్థిక సార్ధకత పొందాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి పావలా వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడమే మన సమస్యల పరిష్కారానికి మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో DCC అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.