నాకు రెండు సార్లు పెళ్లి చేసేశారు.. మిల్కీ బ్యూటీ!

విధాత: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నటన, అందాలతో.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2005వ సంవత్సరంలో బాలీవుడ్ చిత్రమైన ‘చాంద్ స రోషన్ చే హర’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. తెలుగులో డైలాగ్ కింగ్‌గా పేరు పొందిన మోహన్ బాబు కుమారుడు మనోజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీ’ చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా.. ఎన్నో చిత్రాలలో నటిస్తూ.. […]

  • By: krs    latest    Dec 09, 2022 5:03 AM IST
నాకు రెండు సార్లు పెళ్లి చేసేశారు.. మిల్కీ బ్యూటీ!

విధాత: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నటన, అందాలతో.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2005వ సంవత్సరంలో బాలీవుడ్ చిత్రమైన ‘చాంద్ స రోషన్ చే హర’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. తెలుగులో డైలాగ్ కింగ్‌గా పేరు పొందిన మోహన్ బాబు కుమారుడు మనోజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీ’ చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా.. ఎన్నో చిత్రాలలో నటిస్తూ.. టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తోంది.

ఆమె తెలుగులో నటించే తొలి చిత్రం ‘శ్రీ’ అయినా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మాత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ మూవీనే. సౌందర్య, అనుష్కల తర్వాత అందం, అభినయం కలగలిసిన నటిగా తమన్నా భాటియా పేరు పొందింది. ముఖ్యంగా పాటలలో వచ్చే క్లిష్టమైన స్టెప్స్‌ను కూడా ఆమె అవలీలగా చేసేస్తుంది.

మ‌న దేశంలోనే డ్యాన్స్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న‌కు త‌మ‌న్నాతో క‌లిసి న‌టించాల‌ని ఉన్న‌ద‌ని బ‌హిరంగంగా త‌న కోరిక‌ను వెల్ల‌డించాడంటే.. ఆమె డ్యాన్సింగ్ స్కిల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే మూడు పదుల వయసు దాటి ఇంకా ముందుకెళ్తున్నా కూడా.. ఆమె గ్లామర్‌లో వన్నె తగ్గలేదు కానీ.. అవకాశాలు మాత్రం ఈ మధ్య కాస్త తగ్గాయనే చెప్పుకోవాలి.

వాస్తవానికి తమన్నాని సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్‌లో ఒకరిగా చెప్పాలి. దాదాపు అందరూ స్టార్ట్ హీరోలతో కలిసి నటించింది. ప్ర‌తి సినిమాకు కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న రోజులలో తమన్నా ఇప్పటికీ తన డిమాండ్ తగ్గకుండా ఉంచుకోవడం చూస్తే ఇది వేరొకరికి సాధ్యమా అని అనిపించక మానదు. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు ఓటీటీ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఆమె మెగాస్టార్ చిరంజీవితో బోళా శంకర్ చిత్రం చేస్తోంది.

అయితే ఈ మధ్య తమన్నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. మూవీ ఛాన్సెస్ తగ్గుతున్నాయి. ఓటీటీలకే సంప్రదిస్తున్నారు.. ఇక సినిమాలు ఆపి.. కాజల్‌లా పెళ్లి చేసుకోమం టూ కొందరు సలహాలు ఇచ్చేవాళ్లు కూడా ఈ మధ్య ఆమె చుట్టూ చేరారు. పెళ్లి అంటూ వార్తలు రావడం, వాటిని కండించడం వంటివి తమన్నాకి కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె ఈ వార్తలపై సెటైరికల్‌గా సమాధానమిచ్చింది.

రీసెంట్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న తమన్నా.. తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘నాకు పెళ్లిపై.. మా ఇంట్లో ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే.. సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ, ఈలోపే నాకు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తతో పెళ్లి అయిపోయినట్లు, ఒక స్టార్ హీరోతో వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి.

ఈ రకంగా చూసుకుంటే నెటిజన్లు సోషల్ మీడియాలో నాకు రెండు సార్లు పెళ్లి చేసేశారు. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ నాకు పెళ్లి ఫిక్స్ అయితే మాత్రం.. నేనే చెప్తాను కదా! పెళ్లి విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు’’ అని పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్‌కి తమన్నా బ్రేక్ వేసింది.