CM Jagan | చంద్రబాబుకు వలంటీర్‌గా ఉన్న పవన్ చాన్నాళ్లకు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన జగన్ విధాత: వాలంటీర్లు సామాజిక.. సంఘవిద్రోహ శక్తులు.. మహిళల అక్రమ రవాణాకు వాళ్ళే కారకులు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రలో పెద్ద దుమారం లేపాయి. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నాయకులు మొత్తం పవన్ మీద ఎదురుదాడి చేశారు. వలంటీర్లు సైతం భారీగా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేశారు. అయినా పవన్ వెనక్కి తగ్గకపోగా అవే కామెంట్స్ మళ్ళీ రిపీట్ […]
CM Jagan |
విధాత: వాలంటీర్లు సామాజిక.. సంఘవిద్రోహ శక్తులు.. మహిళల అక్రమ రవాణాకు వాళ్ళే కారకులు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రలో పెద్ద దుమారం లేపాయి. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నాయకులు మొత్తం పవన్ మీద ఎదురుదాడి చేశారు. వలంటీర్లు సైతం భారీగా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేశారు. అయినా పవన్ వెనక్కి తగ్గకపోగా అవే కామెంట్స్ మళ్ళీ రిపీట్ చేశారు. దీంతో ఏకంగా జగన్ లైన్లోకి వచ్చారు. అంతేకాకుండా తన టీమ్ అయిన వలంటీర్లు జోలికి వస్తె ఊరుకోనని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దగ్గర వాలంటీర్‌గా పని చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈమధ్య కాలంలో జగన్ నోటి నుంచి ఈ స్థాయి ఎదురుదాడి చూసి ఉండని కార్యకర్తలు ఇప్పుడు మంచి హుషార్ అవుతున్నారు.
వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల బదిలీ సభ కార్యక్రమంలో జగన్ ప్రసంగిస్తూ.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా గట్టిగా ఎదురుదాడి చేశారు. వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఎండ, వాన, చలి, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఒకటో తేదీ వచ్చిందంటే.. అది సెలవు రోజైనా, పండగరోజైనా ఉదయాన్నే తలుపు తట్టి అవ్వా తాతలకు పెన్షన్ ఇస్తున్నారని జగన్ వాలంటీర్లను కొనియాడారు. అలాంటి వాళ్లపై బురద జల్లుతున్నారని జగన్ నిప్పులుగాక్కారు.
వాలంటీర్లు అంటే ఎవరో కొత్త వారు కాదని, అదే ఊరు,, అదే వీధిలో కళ్ల ముందు తిరిగేవారే.. అలాంటి వారిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా “ఇందుకు సంబంధించిన స్క్రిప్టు రామోజీరావు, నిర్మాత చంద్రబాబు అయితే.. నటనా, మాటలూ, డైలాగులూ అన్నీ దత్తపుత్రుడివి” అని జగన్ సెటైర్లు వేశారు. అనంతరం మరింత సీరియస్ అయిన జగన్.. వాలంటీర్లు స్త్రీలను లోభరచుకుంటారని ఒకడంటాడు.. గ్రామవాలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ముంబాయికో ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారని ఇంకొకడు నిస్సిగ్గుగా అంటాడు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్లంతా చదువుకున్న సంస్కారులు అని జగన్ చెబుతూ అలాంటి వారి క్యారెక్టర్ ని తప్పుపట్టిన వారిలో ఒకరు 10ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీరుగా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ అని, ఇంకొకరు చంద్ర బాబు అని, వారి అనుకూల మీడియా కలిసిన గజదొంగల ముఠా అని అన్నారు. అసలు చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, దత్త పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో ప్రజలకు బాగా తెలుసన్నారు.
“చంద్రబాబు నాయుడి వాలంటీర్, దత్తపుత్రుడు అమ్మాయిలను లోబరచుకుని, వారిని పెళ్లిచేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. మళ్లీ వదిలేయడం.. మళ్లీ ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం మళ్లీ వదిలేయడం.. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు” ఇక మరోవ్యక్తి “పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్ లో డ్యాన్సులు చేసేవాడు ఇంకొకడు”. ఇంకొకరు “అమ్మాయిలు కనిపిస్తే చాలు ముద్దైన పెట్టాలి, లేదా కడుపైనా చేయాలని ఇంకొకడు అంటాడు” అని మొత్తం లోకేష్, బాలకృష్ణ ఇలా అందర్నీ నిలదీశారు జగన్. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వారంతా… వాలంటీర్ల గురించి విమర్శలు చేయడం దారుణమని ఆరోపించారు.