Cricketer | ఆ స్టార్ క్రికెట‌ర్.. అలాంటి భ‌యంక‌రమైన వ్యాధితో పోరాడుతున్నాడా.. అది లేనిదే నిద్ర పోడ‌ట‌..!

Cricketer: క్రికెట్‌లో కొన్ని క్లాసిక్ షాట్స్ ఉంటాయి. వాటిని ఎవరు తక్కువ అంచ‌నా వేయ‌లేరు. అలాంటి షాట్స్ ఆడుతుంటే చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఉన్నచోటు నుంచి కాలు కదపకుండా మైదానం నలువైపులా బంతిని పంపించే స‌త్తా కొద్ది మందికే ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న అతి కొద్ది మంది క్రికెటర్లలో దక్షిణాఫ్రికా దిగ్గజం, మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియర్స్ ఒకడు. ఈ సఫారీ మాజీ క్రికెటర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై […]

  • By: sn    latest    Jul 22, 2023 2:31 PM IST
Cricketer | ఆ స్టార్ క్రికెట‌ర్.. అలాంటి భ‌యంక‌రమైన వ్యాధితో పోరాడుతున్నాడా.. అది లేనిదే నిద్ర పోడ‌ట‌..!

Cricketer: క్రికెట్‌లో కొన్ని క్లాసిక్ షాట్స్ ఉంటాయి. వాటిని ఎవరు తక్కువ అంచ‌నా వేయ‌లేరు. అలాంటి షాట్స్ ఆడుతుంటే చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఉన్నచోటు నుంచి కాలు కదపకుండా మైదానం నలువైపులా బంతిని పంపించే స‌త్తా కొద్ది మందికే ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న అతి కొద్ది మంది క్రికెటర్లలో దక్షిణాఫ్రికా దిగ్గజం, మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియర్స్ ఒకడు. ఈ సఫారీ మాజీ క్రికెటర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి అభిమానుల‌ని నిరాశ‌ప‌రిచాడు. ఇక 2‌021 ఐపీఎల్ తర్వాత ఈ లీగ్ నుంచి కూడా తప్పుకొని పెద్ద షాకే ఇచ్చాడు. అయితే క్రికెట‌ర్‌గా కాక‌పోయిన కామెంటేట‌ర్‌గా ఈ ఏడాది ఐపీఎల్‌లో సంద‌డి చేశాడు ఏబీడీ.

తాజా ఏబీ డివిలియ‌ర్స్ ఆరోగ్యం గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తనకు నిద్ర పట్టని సమస్య చాల ఉందని… దాని వల్ల ఎంతో నరకం అనుభవిస్తున్నట్టు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు డివిలీయర్స్. రాత్రి అయితే.. అస్సలు నిద్ర ప‌ట్ట‌దని చెప్పిన డివిలియ‌ర్స్ నిద్ర రావ‌డం కోసం స్లీపింగ్‌ పిల్స్‌ వేసుకునే వాడిని అని అన్నాడు. 2013 సంవత్సరం నుంచి..తాను సమస్య తో బాధపడుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. దాదాపు 10 ఏళ్ల నుండి ఈ సమస్య త‌న‌ని వేధిస్తుంద‌ని పేర్కొన్నాడు. రేపు మ్యాచ్ అంటే .. ఇవాళ రాత్రి అస్సలు నిద్ర రాదని.. దాంతో స్లీపింగ్‌ పిల్స్‌ వేసుకునే వాడిని అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అయితే క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాక.. నిద్ర సమస్య కాస్త తగ్గిందని చెప్పుకొచ్చారు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలీయర్స్. అయితే త‌న మాదిరిగా ఎవరూ కూడా స్లీపింగ్‌ పిల్స్‌ వాడొద్దంటూ హెచ్చ‌రించాడు. అది ఆరోగ్యంపై చాలా ప్ర‌భావితం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌నకి ఇంకా క్రికెట్ ఆడే స‌త్తా ఉంద‌ని చెప్పిన డివీలియ‌ర్స్ గతంలో మాదిరిగా వేగంగా ఆడలేను అని అన్నారు. త‌న చిన్నతనం నుంచి ఎప్పుడు మ్యాచ్ ఆడినా కూడా బెస్ట్ ఇవ్వాలనే భావించేవాడిని. ఇప్పుడు నేను తిరిగి వచ్చి ఆడిన కూడా నాలోని అత్యుత్తమ ఆటనే ఆడాలని ప్రయత్నిస్తుంటాను. నా సహచర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లతో పోటీ పడేలాగా ఆడాల‌నే క‌సి నాలో ఉంటుంది అని డివిలియ‌ర్స్ అన్నాడు