వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రిటైర్మెంట్.. విరాట్ ఫ్రెండ్ కూడా హింట్ ఇచ్చేశాడు..!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొన్ని రికార్డులు సెట్ చేసిన విషయం తెలిసిందే. వాటిని అధిగమించడం ఒక్క విరాట్ కోహ్లీ వల్లనే అవుతుందని అందరు భావిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కోహ్లీ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లి తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని కేవలం టెస్ట్‌లు, ఐపీఎల్‌పై దృష్టి సారిస్తూ ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తాడంటూ అతని బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ తరువాత కోహ్లీ టీ20లకు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలియజేశాడు. 2027 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ పైనే అతను ఎక్కువ దృష్టి పెట్టినట్టు డివిలియర్స్ స్పష్టం చేశాడు.
ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే విరాట్ కోహ్లీకి ఇంతకంటే గొప్పదనం ఏముంటుందని.. అది కోహ్లీకి గొప్ప కానుకగా నిలుస్తుందన్నాడు డివిలియర్స్. థ్యాంక్యూ వెరీ మచ్. ఇక నుంచి నేను టెస్ట్ క్రికెట్, కాస్త ఐపీఎల్ మాత్రమే ఆడతాను.. నా కెరీర్ చివరి రోజులను ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీతో కాస్త టైమ్ గడుపుతాను. మీ అందరికీ గుడ్ బై చెబుతాను అని కోహ్లి చెప్పే అవకాశం ఉందని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలియజేశాడు. డివిలియర్స్ కామెంట్స్ ఇప్పుడు అభిమానులలో లేని పోని సందేహాలు కలిగిస్తున్నాయి. వన్డేల్లో ప్రస్తుతం కోహ్లి 47 సెంచరీలు చేయగా, మరో రెండు సెంచరీలు చేస్తే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో సమం అవుతారు. వరల్డ్ కప్‌లో ఇది జరుగుతుందని అందరు భావిస్తున్నారు.
అయితే కోహ్లీ సచిన్ రికార్డ్ ని సమం చేయాలని అనుకోడని, అతను తన టీమ్ కోసం వరల్డ్ కప్స్ గెలిపించాలని అనుకుంటాడు. అన్ని ఫార్మాట్లలో సక్సెస్ కావాలని అనుకుంటాడు. అతడో టీమ్ ప్లేయర్. ఫీల్డ్ లో అతని నుంచి మనం అందుకే అన్ని రకాల ఎమోషన్లనీ చూస్తాం. గెలవడం అతనికి ఎంత ముఖ్యమో అవే చెబుతాయి అంటూ డివిలయర్స్ చెప్పుకొచ్చాడు. కాగా, కోహ్లి ఇప్పటి వరకూ ఇండియా తరఫున 111 టెస్టులు, 280 వన్డేలు, 115 టీ20లతోపాటు ఐపీఎల్లో 237 మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే .