Indian Cricketers Retirement|సాహా దారిలోనే మరో ముగ్గురు భారత ఆటగాళ్లు.. ఎప్పుడు రిటైర్ కానున్నారంటే..!
Retirement|ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారింది. మంచి ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న ప్లేయర్స్ అద్భుతమైన ప్రతిభని కనబరచకపోతే తీసి పక్కన పెడుతున్నారు. స్టార్ ప్లేయర్స్ అని కనికరం కూడా చూపించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రోహిత్ శర్మ, విరాట్ కో

Retirement|ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారింది. మంచి ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న ప్లేయర్స్ అద్భుతమైన ప్రతిభని కనబరచకపోతే తీసి పక్కన పెడుతున్నారు. స్టార్ ప్లేయర్స్ అని కనికరం కూడా చూపించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలకి కూడా గ్యారెంటీ లేదు.అయితే పునరాగమనం కోసం కొన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్న వృద్ధిమాన్ సాహా రీసెంట్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రంజీ సీజన్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడు. సాహా రిటైర్మెంట్ తర్వాత, రాబోయే రోజుల్లో ఈ ప్లేయర్స్ కూడా రిటైర్‌మెంట్ కానున్నట్టు తెలుస్తుంది.
వారిలో కరుణ్ నాయర్ ఒకరు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. కరుణ్ చాలా కాలంగా భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయాడు. 2017లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అతనికి మళ్లీ భారత్ తరపున ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు వయస్సు కూడా పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక భారత క్రికెట్ జట్టులో టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీ పూర్తి చేసిన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. 2007లో కెరీర్‌లోకి అడుగుపెట్టిన ఇషాంత్, ఆ తర్వాత 2021 వరకు ఆడటం కొనసాగించాడు. 105 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 311 వికెట్లు తీసుకున్నాడు.
ఇషాంత్ పునరాగమనం కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో, అతను త్వరలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక భారత క్రికెట్ జట్టులో విదర్భ ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. 2023 సంవత్సరం తర్వాత, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడింది లేదు. ప్రస్తుత పరిస్థితిలో ఉమేష్‌కి పిలుపు రావడం కష్టమే. ఈ క్రమంలో ఉమేష్ యాదవ్ త్వరలో పదవీ విరమణ నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు 57 టెస్టులాడిన ఉమేష్ 170 వికెట్లు తీశాడు. వీరితో పాటు మరి కొందరు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.