Telangana CS K Ramakrishna Rao Retirement : మార్చి 31న రిటైర్ కానున్న సీఎస్…14సార్లు తెలంగాణ బడ్జెట్ రూపకల్పన

తెలంగాణ సీఎస్ కే.రామకృష్ణారావు మార్చి 31న రిటైర్. వరుసగా 14సార్లు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేసిన ఆయన సేవలకు ముగింపు. సీఎం వినతితో సేవా పొడిగింపు పొందిన అధికారి.

Telangana CS K Ramakrishna Rao Retirement : మార్చి 31న రిటైర్ కానున్న సీఎస్…14సార్లు తెలంగాణ బడ్జెట్ రూపకల్పన

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామ‌కృష్ణారావు వచ్చే నెల మార్చి 31వ తేదీ న పదవీ విరమణ చేయనున్నారు. బడ్జెట్, ఆర్థిక వనరుల నిర్వహణపై విశేష అనుభవం ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం ఏడు నెలలు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనున్నది. ఆగస్టు 30వ తేదీ 2025 లో ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఆర్థిక శాఖలో కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనలో సుధీర్ఘ అనుభవం సాధించిన ఆయన వరుసగా 14సార్లు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రూపకల్పన చేశారు. ఇందులో రెండుసార్లు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కూడా ఉంది. ఐఐటీ ఖరగ్ పూర్, ఢిల్లీలో విద్యను అభ్యసించిన ఆయన పెట్టుబడులపై బిజినెస్ మేనేజిమెంట్ పట్టా తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఫైనాన్స్ మేనేజిమెంట్ లో మంచి పట్టు సంపాదించారు. తన పదవీ కాలంలో అనేక పదవులు నిర్వర్తించిన ఆయన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అదిలాబాద్, గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసి స్థానిక ప్రజల మన్ననలు పొందారు. ఆర్థిక సంస్కరణలు, సంస్థల నిర్వహణ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. మూడు దశాబ్ధాల పాటు సర్వీసును పూర్తి చేసుకున్న రామ‌కృష్ణారావు మార్చి 31వ తేదీ, 2026ను రిటైర్ కాబోతున్నారు.

ఇవి కూడా చదవండి :

Liquor Shops Close: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్
Gold Silver Price Today : షాకింగ్..అకస్మాత్తుగా పెరిగిన బంగారం, వెండి ధరలు!