Virat Kohli|కోహ్లీ క‌థ ముగిసిన‌ట్టేనా.. ఆ గ‌ణంకాలు చూసి రిటైర్ అయిపోమంటున్న నెటిజ‌న్స్

Virat Kohli|స‌చిన్ టెండూల్క‌ర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో రాణించిన భార‌త ఆట‌గాడు విరాట్ కోహ్లీ. కెరీర్‌లో ఎన్నో సెంచరీల‌తో ప‌రుగులు కూడా రాబ‌ట్టాడు.విరాట్ కోహ్లీ విధ్వంసానికి బౌల‌ర్స్ బెంబెలెత్తిపోయేవారు. కోహ్లీని ఔట్ చేసేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చించేవారు. కాని ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారింది.కొద్ది సంవ‌త్స‌రాలు కోహ్లీ దారుణ‌మైన ఫామ్‌తో నిరాశ‌ప‌రుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరస్ట్‌గా ఆడు

  • By: sn    sports    Oct 28, 2024 8:07 AM IST
Virat Kohli|కోహ్లీ క‌థ ముగిసిన‌ట్టేనా.. ఆ గ‌ణంకాలు చూసి రిటైర్ అయిపోమంటున్న నెటిజ‌న్స్

Virat Kohli|స‌చిన్ టెండూల్క‌ర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో రాణించిన భార‌త ఆట‌గాడు విరాట్ కోహ్లీ. కెరీర్‌లో ఎన్నో సెంచరీల‌తో ప‌రుగులు కూడా రాబ‌ట్టాడు.విరాట్ కోహ్లీ విధ్వంసానికి బౌల‌ర్స్ బెంబెలెత్తిపోయేవారు. కోహ్లీని ఔట్ చేసేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చించేవారు. కాని ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారింది.కొద్ది సంవ‌త్స‌రాలు కోహ్లీ దారుణ‌మైన ఫామ్‌తో నిరాశ‌ప‌రుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరస్ట్‌గా ఆడుతున్న విరాట్ కోహ్లీ.. శనివారం ముగిసిన పుణె టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లో మిచెల్ శాంట్న‌ర్‌కి రెండు సార్లు దొరికిపోయాడు.ఆయ‌న ఔటైన తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

కోహ్లీ పామ్ కోల్పోయి తిరిగి క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒక ఏడాదిలో అత్యంత తక్కువ పరుగుల్నివిరాట్ కోహ్లీ చేశాడు. ఒక‌ప్పుడు ఆధిపత్యం చూపించి కింగ్ కోహ్లీగా పేరు తెచ్చుకున్న ఇత‌ను ఇప్పుడు అనామ‌క బౌల‌ర్స్‌కి సైతం వికెట్ సింపుల్‌గా ఇచ్చేస్తున్నారు. కోవిడ్ -19 తర్వాత విరాట్ కోహ్లీ 2020, 2021, 2022లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాడు. సెంచరీ కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే.. సెంచరీ రాకపోయినా.. కోహ్లీ పరుగులైతే చేయగలిగాడు. కానీ.. 2024లో సెంచరీ రాకపోగా.. పరుగులు రాబ‌ట్ట‌డం కూడా గ‌గ‌నంగా మారింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్‌ల‌లో 31.80 సగటుతో 159 పరుగులు చేశాడు.

కానీ 2024లో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 18 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 21.95 సగటుతో 483 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయలేదు. గతంలో 2008, 2020, 2021 సంవ‌త్సరాలలో కూడా కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా రెండు నెలల సమయం ఉండ‌గా, న్యూజిలాండ్‌తో నవంబరు 1 నుంచి ఆఖరి టెస్టు, ఆ తర్వాత నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో అయిన‌ కోహ్లీ రాణించి విమ‌ర్శ‌కుల‌కి గ‌ట్టి స‌మాధానం ఇవ్వాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేదంటే కోహ్లీ రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెర‌గ‌డం ఖాయం.