Wriddhiman Saha | క్రికెట్‌ వీడ్కోలు పలికిన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా

Wriddhiman Saha | భారత వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహా క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీయే కెరియర్‌లో చివరిదని వెల్లడించారు. ఆఖరిసారిగా తన సొంత జట్టు బెంగాల్‌ తరఫున ఆడుతున్నట్లుగా ప్రకటించారు.

Wriddhiman Saha | క్రికెట్‌ వీడ్కోలు పలికిన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా

Wriddhiman Saha | భారత వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహా క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీయే కెరియర్‌లో చివరిదని వెల్లడించారు. ఆఖరిసారిగా తన సొంత జట్టు బెంగాల్‌ తరఫున ఆడుతున్నట్లుగా ప్రకటించారు. నా క్రికెట్‌ ప్రయాణంలో ఈ రంజీ సీజన్‌ ఆఖరిది. రిటైర్‌ అయ్యే ముందు రంజీ ట్రోఫీలో చివరిగా బెంగాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. తన కెరియర్‌లో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తనకు అందించిన మద్దతు కెరీర్‌లో కీలకమైందని.. ఈ సీజన్‌ని గుర్తుంచుకునేలా ముగిద్దాం అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. వృద్ధిమాన్‌ సహా వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

దేశవాళీ క్రికెట్లో 2007 నుంచి బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. 2022 నుంచి రెండేళ్ల పాటు త్రిపురకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఉద్దేశంతో 2024 సీజన్‌లో తిరిగి బెంగాల్‌‌ జట్టులోకి చేరాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో రెండు, మూడు రౌండ్లు ఆడాడు. తొలి రౌండ్‌లో యూపీతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కాగా.. ఇక కేరళతో జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో సాహాకి బ్యాటింగ్ దిగలేదు. ఇటీవల తన రిటైర్‌మెంట్‌పై సాహా స్పందించాడు. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతానని పేర్కొన్నారు. గతం, భవిష్యత్‌పై ఆలోచన చేయనని.. వర్తమానంలో మాత్రమే ఉంటానని చెప్పుకొచ్చారు. గతంలో జరిగినవన్నీ నేను మరచిపోయానని.. ఓ స్పోర్ట్స్‌ సంస్థతో మాట్లాడాడు. రిటైర్‌మెంట్‌ తర్వాత బెంగాల్‌ క్రికెట్‌కు సహాయం చేస్తానని.. పాలనాపరమైన పాత్రకు బదులుగా కోచింగ్‌ విషయంలో సహాయం చేయడం మంచదని భావిస్తున్నానని సాహా చెప్పుకొచ్చాడు.