Threads | త్వ‌ర‌లోనే థ్రెడ్స్ వెబ్ వెర్ష‌న్ అందుబాటులోకి.. యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యం

Threads | విధాత‌: ట్విట‌ర్‌ (Twitter) కు పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. థ్రెడ్స్ పేరుతో ఒక మైక్రోబ్లాగింగ్ సైట్‌ను తీసుకొచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఇది యాప్ రూపంలోనే ఉండ‌గా.. త్వ‌ర‌లోనే వెబ్ వెర్ష‌న్‌ను తీసుకురానున్నార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఎంత వేగంతో యూజ‌ర్ల‌ను సంపాదించుకుందో అంత‌కంటే రెట్టింపు వేగంతో యూజ‌ర్లు థ్రెడ్స్ (Threads) విడిచిపెడుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మెటా నిర్ణ‌యం తీసుకోవడం గ‌మ‌నార్హం. థ్రెడ్స్‌కు […]

Threads | త్వ‌ర‌లోనే థ్రెడ్స్ వెబ్ వెర్ష‌న్ అందుబాటులోకి.. యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యం

Threads | విధాత‌: ట్విట‌ర్‌ (Twitter) కు పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. థ్రెడ్స్ పేరుతో ఒక మైక్రోబ్లాగింగ్ సైట్‌ను తీసుకొచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఇది యాప్ రూపంలోనే ఉండ‌గా.. త్వ‌ర‌లోనే వెబ్ వెర్ష‌న్‌ను తీసుకురానున్నార‌ని తెలుస్తోంది.

ఈ మేర‌కు వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఎంత వేగంతో యూజ‌ర్ల‌ను సంపాదించుకుందో అంత‌కంటే రెట్టింపు వేగంతో యూజ‌ర్లు థ్రెడ్స్ (Threads) విడిచిపెడుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మెటా నిర్ణ‌యం తీసుకోవడం గ‌మ‌నార్హం.

థ్రెడ్స్‌కు ఇప్ప‌టికే స‌గం మంది యూజ‌ర్లు దూర‌మ‌య్యార‌ని తెలుస్తుండగా… వెబ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా మెటా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. 100 మిలియ‌న్ల యూజ‌ర్లు సైన్ అప్ అయితే అందులో స‌గం మంది యాప్ ఉప‌యోగించినా.. అది అద్భుత‌మే కానీ మ‌నం దానికి చాలా దూరంలో ఉన్నాం అని మెటా అధినేత జుక‌న్‌బ‌ర్గ్ .. ఉద్యోగుల‌తో వ్యాఖ్యానించినట్లు రాయిట‌ర్స్ పేర్కొంది.

కొత్త‌వారిని ఆక‌ర్షించ‌డం క‌న్నా ఉన్న‌వారిని నిలుపుకోవడానికి ప్ర‌యాత్నించాల‌ని సూచించిన‌ట్లు రాసుకొచ్చింది. అయితే థ్రెడ్స్ విడుద‌లైన తొలి రోజుల్లో ట్విట‌ర్‌కు పోటీగా వ‌స్తుంద‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. యూజ‌ర్ల సైన్ అప్‌లు కూడా అలానే జ‌రిగాయి.

అయితే త‌ర్వాతి రోజుల్లో దానిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ట్విట‌ర్ అధినేత సైతం.. థ్రెడ్‌ను ట్విట‌ర్ కాపీ అని విమ‌ర్శిస్తూ.. మెటా (Meta) పై కేస్ వేస్తానని సైతం ప్ర‌క‌టించాడు. పైగా కొన్ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు సైతం థ్రెడ్స్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వాణిజ్యప‌రంగా మెటాకు పెద్ద దెబ్బే త‌గిలింది.