విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు: మాజీ మంత్రి DL రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపు మరో రెండు ప్రధాన హత్యలు జరగనున్నాయని, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు జరిగే అవకాశముందని మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డి.ఎల్.రవీంద్రా రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ, ఆయన కుమార్తె షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. […]

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపు మరో రెండు ప్రధాన హత్యలు జరగనున్నాయని, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు జరిగే అవకాశముందని మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డి.ఎల్.రవీంద్రా రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ, ఆయన కుమార్తె షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
వీరిద్దరూ ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్‌లో నివాసం ఉంటుందన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన షర్మిల తన రాజకీయ భవిష్యత్తు కోసం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కుమార్తెకు మద్ధతుగా విజయమ్మ హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు వీరిద్దరి హత్య జరిగే ప్రమాదం ఉందని డి.ఎల్ అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపి సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ ఎంపీ వై.ఎస్. వివేకానంద రెడ్డి ని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరుగుతోంది. గత ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే కడపలో వివేకానంద రెడ్డి హత్య, విశాఖపట్నం ఏయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి డ్రామా జరిగాయని ఆయన గుర్తు చేశారు.
జగన్ రెడ్డిపై కోడికత్తితో దాడి వెనకాల కుట్ర కోణం పాడు లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వెల్లడించడంతో ప్రశాంత్ కిశోర్ కుట్ర బట్టబయలైందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సానుభూతి కోసమే ఈ రెండు ఘటనలకు ప్రశాంత్ రూపకల్పన చేశారని డి.ఎల్.రవీంద్రా రెడ్డి అన్నారు.
అమరావతిలోని తాడేపల్లి సిఎం క్యాంప్ ఆఫీసు నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి రాజ్యంగం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంత మంది సిబిఐ అధికారులను మార్చినా ప్రయోజనం లేదని, నిందితులకు శిక్షలు తప్పవని చెప్పారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి తరహాలో పాలన చేస్తారని గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు బ్రహ్మరథం పట్టారని, అందుకు భిన్నంగా పాలన జరుగుతోందన్నారు.