MLC Vijayashanti: ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ సినీ నటి విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి అంతు చూస్తామని బెదిరిస్తున్నాడని విజయశాంతి భర్త శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

MLC Vijayashanti: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ సినీ నటి విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి అంతు చూస్తామని బెదిరిస్తున్నాడని విజయశాంతి భర్త శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో చంద్రకిరణ్ రెడ్డి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూసేవాడు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డిని ఎమ్మెల్సీ విజయశాంతి పక్కన పెట్టారు.
తనకు ఇవ్వాల్సిన పెండింగ్ డబ్బులు చెల్లించాలని విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్నాడని..అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని విజయశాంతి దంపతులు పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాము అతనికి ఎలాంటి బకాయిలు లేమని శ్రీనివాస్ స్పష్టం చేశారు. చంద్రకిరణ్ రెడ్డి గతంలో తమతో కలిసి పనిచేస్తూనే సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడని శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయశాంతి దంపతుల ఫిర్యాదుతో పోలీసులు చంద్రకిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.