Karimnagar | మూడేళ్ల చిన్నారి అదృశ్యం.. కిడ్నాప్ చేశారా, నాలాలో కొట్టుకుపోయిందా!
Karimnagar | తల్లిదండ్రుల ఆందోళన దర్యాప్తు చేస్తున్న పోలీసులు విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్‌లో ఓ చిన్నారి అదృశ్యమైంది. మూడు రోజులుగా పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన యశ్వంత కార్వే, సబిత కార్వే దంపతులు జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. వారి మూడేళ్ల కూతురు కృతిక ఆడుకోవడానికి బయటకు వెళ్లి అదృశ్యమైంది. పాప కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో […]

Karimnagar |
- తల్లిదండ్రుల ఆందోళన
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్‌లో ఓ చిన్నారి అదృశ్యమైంది. మూడు రోజులుగా పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన యశ్వంత కార్వే, సబిత కార్వే దంపతులు జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు.
వారి మూడేళ్ల కూతురు కృతిక ఆడుకోవడానికి బయటకు వెళ్లి అదృశ్యమైంది. పాప కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వర్షాలతో ఇటీవల నాళాలు పొంగి ప్రవహించడంతో అందులో పడి కొట్టుకుపోయి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా చుట్టుపక్కల నాలాలలో పాప కోసం గాలించారు. సిసి ఫుటేజ్ లో కృతిక ఇంటికి కొంత దూరం వెళ్లిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను ఎవరైనా ఎత్తుకు వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.