Wanaparthy | వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ లొల్లి.. కార్యకర్తల సమావేశo రసాభస
Wanaparthy విధాత, ఉమ్మడి, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వనపర్తి కాంగ్రెస్ పార్టీ లో టికెట్ లొల్లి మొదలయింది. టికెట్ తన కంటే తనకు అని ఇద్దరు నేతల మధ్య జరిగిన వాగ్వవాదంలో సమావేశం రాసాబసగా మారింది. వివరాల్లోకి వెళితే. బుధవారం వనపర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నేతల గొడవల మధ్య అర్ధంతరంగా ముగిసింది. మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు […]

మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని ప్రకటించుకున్నారు. దీంతో గొడవ మొదలయింది. కొందరు కార్యకర్తలు కల్పించుకుని నిన్న మొన్న వచ్చిన వారు టికెట్ వస్తుందని ప్రకటించు కోవడం ఏమిటని ఆయనను నిలదీశారు.
శివసేన రెడ్డి వర్గం కార్యకర్తలకు ఎదురు తిరగడంతో గొడవ తీవ్ర మైంది. శివసేన రెడ్డి పై పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు తిట్ల దండకం చేశారు. గొడవ ఎక్కువ కావడంతో సమావేశం నుంచి శివసేన రెడ్డి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఇక్కడే ఉన్న మరో నాయకుడు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి పై కార్యకర్తలు విరుచుకుపడ్డారు.
ఈ మధ్య బీ ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేఘరెడ్డి కూడా టికెట్ తనకే వస్తుందని పలు సమావేశా ల్లో ప్రకటించారు. ఇది దృష్టిలో పెట్టుకున్న కార్యకర్తలు ఆయనపై దుషణలు చేశారు. ఇప్పుడే కాంగ్రెస్ లోకి వచ్చి టికెట్ గురించి మాట్లాడం సరికాదని, ఎవరికి వారు టికెట్ తనదే అని ప్రకటించుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు.
వనపర్తి కాంగ్రెస్ సమావేశం రసాభస..
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డిపై చిన్నారెడ్డి వర్గం దాడిమధ్యలోనే లేచి వెళ్లిపోయిన శివసేనారెడ్డి. కొత్తగా చేరిన ఎంపీపీ మేఘారెడ్డిపై మహిళల ఆగ్రహం.
మంత్రి నిరంజన్ రెడ్డిని మోసం చేసి వచ్చి ఇక్కడ అలాగే చేద్దాం అనుకుంటే కుదరదు. నువ్వు… pic.twitter.com/qHooP2llC5
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2023
గొడవ పెద్దగా కావడంతో ఆయన సమావేశం నుంచి వెళ్లిపోయారు.అక్కడే ఉన్న చిన్నారెడ్డి మాత్రం గొడవ సద్దుమనిగించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ గొడవ చిన్నారెడ్డి పెట్టించి మౌనంగా ఉన్నాడని ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు.