నేడు CM KCRకు.. జాతీయ మేధావుల ధన్యవాద సభ

సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం గర్వకారణం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు అమోఘం ప్రబుద్ధ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం విధాత‌: హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ మహా విగ్రహ స్థాపన సందర్భంగా రవీంద్రభారతిలో జాతీయ మేధావుల ధన్యవాద సభ జరగనున్నది. యూజీసీ మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్ ధోరట్‌ సభ కోసం వచ్చి అంబేద్కర్‌ విగ్రహాన్ని సందర్శించారు. ఈ నెల 14న అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించనున్న విషయం విదితమే. ఈ సభకు […]

నేడు CM KCRకు.. జాతీయ మేధావుల ధన్యవాద సభ
  • సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం గర్వకారణం
  • 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు అమోఘం
  • ప్రబుద్ధ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం

విధాత‌: హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ మహా విగ్రహ స్థాపన సందర్భంగా రవీంద్రభారతిలో జాతీయ మేధావుల ధన్యవాద సభ జరగనున్నది. యూజీసీ మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్ ధోరట్‌ సభ కోసం వచ్చి అంబేద్కర్‌ విగ్రహాన్ని సందర్శించారు. ఈ నెల 14న అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించనున్న విషయం విదితమే. ఈ సభకు ముఖ్యఅతిథిగా సుఖ్‌దేవ్‌ థోరట్‌ హాజరయ్యారు. ఈసభలో ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులు, మేధావులు, ఉపకులపతులు పొల్గొన్నారు

దేశంలోనే 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అమోఘమని ప్రబుద్ధ భారత్‌ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం కొనియాడాయి. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్‌ పేరుపెట్టడం గర్వకారణమని పేర్కొన్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌(CM KCR)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసేందుకు నేడు రవీంద్రభారతిలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించాయి.