Sharwanand | హీరో శ‌ర్వానంద్ కారు బోల్తా.. వచ్చే వారమే పెళ్లి

Sharwanand | టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ కారు ఆదివారం ఉదయం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. శ‌ర్వానంద్ త‌న టీమ్‌తో వెళ్తుండ‌గా ఫిలింన‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో శ‌ర్వానంద్‌కు గాయాల‌య్యాని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లపై శ‌ర్వానంద్ టీం స్పందించింది. శ‌ర్వానంద్‌తో పాటు కారులో ఉన్న ఎవ‌రికీ కూడా గాయాలు కాలేద‌ని ఆయ‌న టీం స్ప‌ష్ట‌త ఇచ్చింది. శ‌ర్వానంద్ అభిమానులు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఇది చాలా స్వ‌ల్ప […]

Sharwanand | హీరో శ‌ర్వానంద్ కారు బోల్తా.. వచ్చే వారమే పెళ్లి

Sharwanand | టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ కారు ఆదివారం ఉదయం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. శ‌ర్వానంద్ త‌న టీమ్‌తో వెళ్తుండ‌గా ఫిలింన‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో శ‌ర్వానంద్‌కు గాయాల‌య్యాని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌లపై శ‌ర్వానంద్ టీం స్పందించింది. శ‌ర్వానంద్‌తో పాటు కారులో ఉన్న ఎవ‌రికీ కూడా గాయాలు కాలేద‌ని ఆయ‌న టీం స్ప‌ష్ట‌త ఇచ్చింది. శ‌ర్వానంద్ అభిమానులు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఇది చాలా స్వ‌ల్ప ప్ర‌మాదం అని టీం తెలిపింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవలే శర్వానంద్‌కు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహనికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్‌గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.