Tomato | ట‌మాటా పండించి.. ల‌క్షాధికారులుగా మారిన అన్న‌ద‌మ్ములు

Tomato | గ‌త రెండు నెల‌ల కాలంలో ట‌మాటా పండించిన రైతులెవ‌రూ న‌ష్ట‌పోలేదు. చాలా మంది రైతులు కోటీశ్వ‌రులుగా మారారు. ట‌మాటా ధ‌ర కొండెక్క‌డంతో కోట్ల రూపాయాలు సంపాదించారు ట‌మాటా రైతులు. ఓ ఇద్ద‌రు యువ రైతులు కూడా ల‌క్షాధికారులుగా మారారు. ట‌మాటాల‌మ్మి రూ. 40 ల‌క్షలు సంపాదించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర జిల్లాలోని ల‌క్ష్మీపుర‌కు చెందిన రాజేశ్(25), న‌గేశ్(23) ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు.. మూడేండ్ల కింద‌ట చ‌దువు ఆపేశారు. ఆ త‌ర్వాత త‌మ‌కున్న రెండు ఎక‌రాల్లో […]

Tomato | ట‌మాటా పండించి.. ల‌క్షాధికారులుగా మారిన అన్న‌ద‌మ్ములు

Tomato | గ‌త రెండు నెల‌ల కాలంలో ట‌మాటా పండించిన రైతులెవ‌రూ న‌ష్ట‌పోలేదు. చాలా మంది రైతులు కోటీశ్వ‌రులుగా మారారు. ట‌మాటా ధ‌ర కొండెక్క‌డంతో కోట్ల రూపాయాలు సంపాదించారు ట‌మాటా రైతులు. ఓ ఇద్ద‌రు యువ రైతులు కూడా ల‌క్షాధికారులుగా మారారు. ట‌మాటాల‌మ్మి రూ. 40 ల‌క్షలు సంపాదించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర జిల్లాలోని ల‌క్ష్మీపుర‌కు చెందిన రాజేశ్(25), న‌గేశ్(23) ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు.. మూడేండ్ల కింద‌ట చ‌దువు ఆపేశారు. ఆ త‌ర్వాత త‌మ‌కున్న రెండు ఎక‌రాల్లో వ్య‌వ‌సాయం ప్రారంభించారు.

ట‌మాటాకు చ‌క్క‌ని ధ‌ర వ‌స్తుంద‌ని ఊహించి, త‌మ పొలం ప‌క్క‌నే గ‌తేడాది మ‌రో 10 ఎక‌రాల భూమి కౌలుకు తీసుకుని, మొత్తం 12 ఎక‌రాల్లో ట‌మాటా సాగు ప్రారంభించారు. దిగుబ‌డితో పాటు ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల బాక్సుల ట‌మాటా విక్ర‌యించి, రూ. 40 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయాన్ని గ‌డించారు.

ఇక ట‌మాటాకు భారీ డిమాండ్ పెరిగిన నేప‌థ్యంలో పొలం వ‌ద్ద నిత్యం కాప‌లాగా ఉండేవాళ్ల‌మ‌ని రైతు రాజేశ్ తెలిపాడు. గ‌తంలో త‌మ కుటుంబం పేరిట ఉన్న అప్పుల‌న్నీ ఒక్క పంట‌తోనే తీరిపోయాయ‌ని పేర్కొన్నాడు. మిగిలిన సొమ్ముతో ఒక కారు కొనుగోలు చేశామ‌న్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తుగా త‌ల్లిదండ్రులు కూడా పొలంలోనే ప‌ని చేస్తూ స‌హ‌కారం అందించ‌డం వ‌ల్లే ఈ లాభాల పంట పండింద‌న్నారు.