Tomato Price | టమాటాలకు.. రక్షణగా బౌన్సర్లు

Tomato Price విధాత‌: ఆకాశాన్ని అంటిన టమాటాను కొనడానికి సామాన్యులు జంకుతున్నారు. పెరిగిన టమాటా ధరలపై అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేళాడ దీసినట్టు.. టమాటాను వేళాడ దీసి దాన్ని చూస్తూ తింటున్నట్టు.. టమాటాలను బీరువాల్లో భద్రపరిచి ఒక్కటి మాత్రమే తీస్తున్నట్టు ఇప్పటికే సోషల్‌మీడియాలో మీమ్స్‌, రీల్స్‌ వైరల్‌ అయ్యాయి. మండిపోతున్న ధరలకు తోడు టమాటాలను కొనుగోలుదారుల నుంచి కాపాడుకోవడమూ వ్యాపారులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో టమాటాలకు రక్షణగా బౌన్సర్లును నియమించుకునే […]

Tomato Price | టమాటాలకు.. రక్షణగా బౌన్సర్లు

Tomato Price

విధాత‌: ఆకాశాన్ని అంటిన టమాటాను కొనడానికి సామాన్యులు జంకుతున్నారు. పెరిగిన టమాటా ధరలపై అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేళాడ దీసినట్టు.. టమాటాను వేళాడ దీసి దాన్ని చూస్తూ తింటున్నట్టు.. టమాటాలను బీరువాల్లో భద్రపరిచి ఒక్కటి మాత్రమే తీస్తున్నట్టు ఇప్పటికే సోషల్‌మీడియాలో మీమ్స్‌, రీల్స్‌ వైరల్‌ అయ్యాయి.

మండిపోతున్న ధరలకు తోడు టమాటాలను కొనుగోలుదారుల నుంచి కాపాడుకోవడమూ వ్యాపారులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో టమాటాలకు రక్షణగా బౌన్సర్లును నియమించుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా వింతగా కనిపిస్తుండవచ్చు. కానీ నిజం. యూపీలో ఓ వ్యాపారి తన దుకాణంలోని టమాటాలకు రక్షణగా బౌన్సర్లను పెట్టాడు.

యూపీలోని వారణాసిలోఆయన చేసిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి ఆయనను అడగగా.. పెరిగిన టమాటాలకు ధర ఎక్కువగా ఉండటంతో ముందుజాగ్రత్తగా తన దుకాణంలో ఉంచిన టమాటాలను కాపాడుకోవడానికే ఇలా చేసినట్టు చెప్పాడు.

తన దుకాణానికి వచ్చిన కొందరు వినియోగదారులు టమాటాలను దొంగతనం చేస్తున్నారని, ఇంకా కొన్నిసార్లు వాటి కోసం కొట్టుకుంటున్నారని ఆ వ్యాపారి తెలిపాడు. అలాంటి వారి నుంచి టమాటాలను కాపాడుకోవడానికే బౌన్సర్లను నియమించుకోవాల్సి వచ్చిందని వివరించాడు.

ప్రస్తుతం టమాటా ధర కిలోకు రూ. 160 అమ్ముతున్నామని, ధర భారీగా ఉండటంతో ప్రజలు 50 గ్రాములు, 100 గ్రాముల చొప్పున మాత్రమే కొంటున్నారని తెలిపాడు.