Tomato | హమ్మయ్యా.. శాంతించిన టమోటా! ధర దిగొస్తోంది

Tomato | మొన్నటి వరకూ రెండొందల వరకూ కిలో ధర పలికిన టమోటా ధర మెల్లగా దిగి వస్తోంది. యాపిల్ ను మించిన ధరతో వంటగదిని ఘాటెక్కించిన టమోటా ఇప్పుడు కాస్త శాంతించింది . మొన్నటివరకూ మార్కెట్లో నూటయాభై. ఒక్కోచోట రెండొందల వరకూ ధర పలికింది. ఈ నెలన్నరలో పంట తీసిన కొందరు రైతులు బాగానే ఆదాయం కళ్లజూశారు. పెద్దమొత్తంలో పంటను వేసిన రైతులు కొందరు కోట్లు సంపాదించగా తక్కువమొత్తంలో పాంగ సాగుచేసిన వాళ్ళు సైతం లక్షలు […]

  • By: krs    latest    Aug 11, 2023 3:06 PM IST
Tomato | హమ్మయ్యా.. శాంతించిన టమోటా! ధర దిగొస్తోంది

Tomato |

మొన్నటి వరకూ రెండొందల వరకూ కిలో ధర పలికిన టమోటా ధర మెల్లగా దిగి వస్తోంది. యాపిల్ ను మించిన ధరతో వంటగదిని ఘాటెక్కించిన టమోటా ఇప్పుడు కాస్త శాంతించింది . మొన్నటివరకూ మార్కెట్లో నూటయాభై. ఒక్కోచోట రెండొందల వరకూ ధర పలికింది.

ఈ నెలన్నరలో పంట తీసిన కొందరు రైతులు బాగానే ఆదాయం కళ్లజూశారు. పెద్దమొత్తంలో పంటను వేసిన రైతులు కొందరు కోట్లు సంపాదించగా తక్కువమొత్తంలో పాంగ సాగుచేసిన వాళ్ళు సైతం లక్షలు కళ్లజూశారు.

టమోటా లారీని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా జరిగాయి. మరో చోట టమోటా తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైతే ఆ టమాటాలు జనం ఎత్తుకెళ్లిపోకుండా అక్కడ పోలీసులను కాపలాగా సెక్యూరిటీగా పెట్టిన ఘటనలు సైతం చూసాం.. హోటళ్లలో టమోటా మిక్సింగ్ వంటలు తగ్గిపోయాయి.

ఏమయ్యా అంటే మాకు గిట్టుబాటు కావడం లేదన్నా అనే సమాధానం వచ్చేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భారీగా కొనుగోలు చేసి సబ్సిడీ మీద రైతుబజార్లలో కిలో రూ. 50కి అందుబాటులో ఉంచి వినియోగ దారులకు కాస్త రిలీఫ్ ఇచ్చారు.

అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఇప్పుడు టమాటా మెల్లగా పొగరు తగ్గి కిందికి దిగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో ఇప్పుడుదాని ధర రూ. 40 లోపే ఉంటోంది. ఇప్పుడు దాని ధ‌ర రూ.30-36కు ప‌డిపోవ‌డం ప్రజలకు ఊరటనిస్తోంది.

ఇత‌ర ప్రాంతాల నుంచి ట‌మోటా పంట దిగుబ‌డి పెర‌డంతోనే ధ‌ర‌లుదిగుతున్నాయి అని వ్యాపారులు అంటున్నారు. రానున్న రెండు వారాల్లో టమాటా మరింత దిగి దాదాపు రూ. 25- 30 వద్ద నిలకడగా ఉంటుందని అంటున్నారు.