ఈ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌కు డిమాండ్ ఎక్కువ‌

విధాత‌: దేశీయ మార్కెట్‌లో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ (విద్యుత్తు ఆధారిత వాహ‌నాలు) హ‌వా న‌డుస్తున్న‌ది. పెరిగిన‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం దృష్ట్యా చాలామంది ఈమ‌ధ్య ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపే చూస్తున్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ మైలేజీ వ‌స్తుండ‌టం కూడా క‌లిసొస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌కూ డిమాండ్ పెద్ద ఎత్తున క‌నిపిస్తున్న‌ది. ఏడాది క్రింద‌టితో పోల్చితే ఈవీ టూవీల‌ర్ల‌కు మార్కెట్‌లో ఆద‌ర‌ణ ఎన్నో రెట్లు పెరిగింది. నిరుడు డిసెంబ‌ర్ అమ్మ‌కాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. […]

  • By: krs    latest    Feb 05, 2023 12:00 AM IST
ఈ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌కు డిమాండ్ ఎక్కువ‌

విధాత‌: దేశీయ మార్కెట్‌లో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ (విద్యుత్తు ఆధారిత వాహ‌నాలు) హ‌వా న‌డుస్తున్న‌ది. పెరిగిన‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం దృష్ట్యా చాలామంది ఈమ‌ధ్య ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపే చూస్తున్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ మైలేజీ వ‌స్తుండ‌టం కూడా క‌లిసొస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌కూ డిమాండ్ పెద్ద ఎత్తున క‌నిపిస్తున్న‌ది.

ఏడాది క్రింద‌టితో పోల్చితే ఈవీ టూవీల‌ర్ల‌కు మార్కెట్‌లో ఆద‌ర‌ణ ఎన్నో రెట్లు పెరిగింది. నిరుడు డిసెంబ‌ర్ అమ్మ‌కాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఇక ఈ విక్ర‌యాల ఆధారంగా టాప్‌-5 ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌లో టీవీఎస్ ఐక్యూబ్ అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. 2022 డిసెంబ‌ర్‌లో 11,071 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. 2021 డిసెంబ‌ర్‌లో 1,212 సేల్సే జ‌రిగాయి.

టాప్‌-5 ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ సేల్స్‌లో ఐక్యూబ్ త‌ర్వాత రెండో స్థానంలో ఏథ‌ర్ 450ఎక్స్ ఉన్న‌ది. గ‌తంతో చూస్తే వీటి అమ్మ‌కాలు 1,761 నుంచి 7.085 యూనిట్ల‌కు ఎగిశాయి. ఇక ఆ త‌ర్వాతి మూడు స్థానాల్లో వ‌రుస‌గా బ‌జాజ్ చేత‌క్‌, ఒకినావా ప్రైజ్ ప్రో, ఒకినావా ఆర్‌30 ఉన్నాయి.