Nalgonda: SPని కలిసిన మావోయిస్టు అగ్ర నేత సత్యంరెడ్డి..! ప్రభుత్వం ఆదుకోవాలని వినతి!!
విధాత: మావోయిస్టు అగ్ర నేత గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావును కలిశారు. 43 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన సత్యం రెడ్డి అలియాస్ గోపన్న పై ఇటీవలే ఛత్తీస్ ఘడ్ పోలీసులు మోపిన కేసులన్నింటిని కొట్టివేయగా, గత నెల 26వ తేదీన స్వగ్రామం మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెంకు చేరుకున్నారు. ఇక మీదట తను జనజీవన స్రవంతిలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించిన సత్యం రెడ్డి మంగళవారం జిల్లా మంత్రి […]
విధాత: మావోయిస్టు అగ్ర నేత గజ్జల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావును కలిశారు. 43 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన సత్యం రెడ్డి అలియాస్ గోపన్న పై ఇటీవలే ఛత్తీస్ ఘడ్ పోలీసులు మోపిన కేసులన్నింటిని కొట్టివేయగా, గత నెల 26వ తేదీన స్వగ్రామం మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెంకు చేరుకున్నారు. ఇక మీదట తను జనజీవన స్రవంతిలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించిన సత్యం రెడ్డి మంగళవారం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
బుధవారం జిల్లా ఎస్పీ అపూర్వరావుని కలిసి జనజీవన స్రవంతిలో జీవించేందుకు ప్రభుత్వము నుండి తనకు ఆర్థిక సహకారం ఇప్పించాలని వినతి పత్రం అందించారు. ఎస్పీని కలిసిన అనంతరం సత్యం రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ స్వగ్రామం సుబ్బారెడ్డి గూడెంలో పదవ తరగతి వరకు చదివిన తాను 1980లో హైదరాబాద్ ఏవి కళాశాలలో ఇంటర్ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో పరిచయం ఏర్పడి పీపుల్స్ వార్ పార్టీలో చేరిపోయానన్నారు.
మావోయిస్టు సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి కేంద్ర కమిటీ సభ్యుడిగా దండకారణ్య ఏరియాలో పార్టీ విస్తరణలో కీలకంగా పని చేసినట్లుగా తెలిపారు. అజ్ఞాతంలో ఉండగా పలు ఎన్ కౌంటర్ల నుండి తృటిలో తప్పించుకున్నానన్నారు. అయితే పార్టీలో ఉండగానే తాను కమల అనే సహచర పార్టీ సభ్యురాలని వివాహం చేసుకోగా ఆమె 2000 సంవత్సరంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతి చెందినట్లు తెలిపారు.
అనంతరం పార్టీకి చెందిన సానుభూతిపరురాలిని తాను రెండో వివాహం చేసుకున్నప్పటికీ 2006లో తనను పోలీసులు అరెస్టు చేయడం జైలు కెళ్లడంతో ఆమె జాడ లేకుండా పోయిందన్నారు. తనపై చత్తీస్ ఘడ్ పోలీసులు 70 కేసులు మోపారన్నారు. తనపై 15 లక్షల రివార్డును చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
43 ఏళ్ల తన మావోయిస్టు ఉద్యమ జీవితంలో 26 ఏళ్లు అడవిలో అజ్ఞాతంలో పనిచేశానని, 17 ఏళ్ల జైలు జీవితం గడిపానని తనపై పోలీసులు మోపిన అన్ని కేసులను చత్తిస్‌ఘడ్ కోర్టులు కొట్టివేయడంతో జైలు నుంచి విడుదలై గత నెల 26వ తేదీన స్వగ్రామానికి చేరుకోవడం జరిగిందన్నారు. తాను ఇక మీదట మావోయిస్టు పార్టీలోకి వెళ్ళబోనని, జనజీవన స్రవంతిలో బతికేందుకు నిర్ణయించుకున్నానని, అందుకే ప్రభుత్వ సాయం కోరుతున్నట్లుగా తెలిపారు.
తనకి పిల్లలు కూడా లేరని, సొంత ఊరిలో ఆస్తులు, భూములు లేవని తాను జీవించడం కోసం ప్రభుత్వ సాయం కోరుతున్నానని అందుకు సహకరించాలని జిల్లా మంత్రిని, ఎస్పీని కలవడం జరిగిందన్నారు. ఎస్పీని కలిసిన గజ్జల సత్యం రెడ్డి వెంట ఆయన సోదరుడు బుచ్చిరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram