TPCC | కాంగ్రెస్‌లో జోష్‌.. కోమటిరెడ్డి ఇంట్లో నేతల భేటీ

TPCC కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలని నిర్ణయం 23న పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం విడదల వారిగా బస్సు యాత్ర జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు ఈనెల30న కొల్లాపూర్‌లో సభ విధాత: కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. BRSపై పైచేయి సాధించే దిశగా పని చేస్తున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులకు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండడంతో నేతలు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు కదులుతున్నారు. విభేదాలు వీడి […]

  • By: krs    latest    Jul 19, 2023 1:37 AM IST
TPCC | కాంగ్రెస్‌లో జోష్‌.. కోమటిరెడ్డి ఇంట్లో నేతల భేటీ

TPCC

  • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలని నిర్ణయం
  • 23న పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం
  • విడదల వారిగా బస్సు యాత్ర
  • జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు
  • ఈనెల30న కొల్లాపూర్‌లో సభ

విధాత: కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. BRSపై పైచేయి సాధించే దిశగా పని చేస్తున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులకు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండడంతో నేతలు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు కదులుతున్నారు. విభేదాలు వీడి కలిసి పని చేయాలని అధిష్టానం ఆదేశించిన తరువాత నేతలు బహిరంగ విమర్శలు మానుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఐక్యతా రాగం అందుకున్నారు. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి, రేవంత్‌లు విభేదాలు మాని కలిసి పోయారు. కోమటిరెడ్డి నుంచి పిలుపు రాగానే రేవంత్‌ వెళ్లారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు.


అధికారంలో ఉన్న BRS చేసిన అవినీతిని బయట పెట్టడంతోపాటు తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి ఈ నెల 23న పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. అలాగే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే వరకు విడతల వారీగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అలాగే జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా రేవంత్‌, భట్టిలు చేపట్టిన పాదయాత్రలు విజయవంతం అయ్యాయన్న నిర్ణయానికి నేతలు వచ్చారు. దీంతో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుల చేరికలతో పార్టీ బలం పెరిగిందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు తెలియజేయడానికి బస్సు యాత్ర చేద్దామని భావించారు. అయితే ఈ యాత్ర ఎవరు చేపట్టాలి? ఏవిధంగా చేయాలన్న దానిపై తరువాత పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

కొల్లాపూర్‌లో ఈనెల20వ తేదీన నిర్వహించాల్సిన సభ అనివార్యకారణాల వల్ల వాయిదా పడడంతో ఈ సభను తిరిగి ఈ నెల 30వ తేదీన నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడి కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి సభ తేదీని ఫైనల్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం AICC ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, PCC అధ్యక్షులు రేవంత్‌రెడ్డిలు ఢిల్లీకి వెళ్లనున్నారు.