Traffic Restrictions | వాహ‌న‌దారుల‌కు అలెర్ట్.. నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions |  విధాత‌: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎన్టీఆర్ గార్డెన్ స‌మీపంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్, అంబేద్క‌ర్ ముని మ‌నువ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ క‌లిసి ఆవిష్క‌రించ‌నున్నారు. దీంతో ఇప్ప‌టికే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగ‌ర్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, నెక్లెస్ రోడ్డును మూసివేస్తున్న‌ట్లు హెచ్ఎండీఏ ప్ర‌క‌టించింది. తాజాగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. #HYDTPinfoIn […]

  • By: Somu    latest    Apr 13, 2023 12:57 PM IST
Traffic Restrictions | వాహ‌న‌దారుల‌కు అలెర్ట్.. నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions |

విధాత‌: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎన్టీఆర్ గార్డెన్ స‌మీపంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్, అంబేద్క‌ర్ ముని మ‌నువ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ క‌లిసి ఆవిష్క‌రించ‌నున్నారు.

దీంతో ఇప్ప‌టికే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగ‌ర్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, నెక్లెస్ రోడ్డును మూసివేస్తున్న‌ట్లు హెచ్ఎండీఏ ప్ర‌క‌టించింది. తాజాగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.