Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..! సాంకేతిక కారణాలతో 20 రైళ్లతో పాటు 16 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ రూట్లలో నడిచే 20 రైళ్లతో పాటు నగర పరిధిలో నడిచే 16 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ నెల 4 నుంచి 10 వరకు ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కాజీపేట్-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రచాలం రోడ్-డోర్నకల్, కాజీపేట్-సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష- కాజీపేట్, సికింద్రాబాద్-వరంగల్, సి ర్పూర్ టౌన్-భద్రాచలం, వరంగల్- హైదరాబాద్, కరీంనగర్-సిర్పూర్‌టౌన్, కరీంనగర్-నిజామాబాద్, కాజీపేట్-బల్హార్షా తదితర […]

Trains Cancelled |
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ రూట్లలో నడిచే 20 రైళ్లతో పాటు నగర పరిధిలో నడిచే 16 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ నెల 4 నుంచి 10 వరకు ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
కాజీపేట్-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రచాలం రోడ్-డోర్నకల్, కాజీపేట్-సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష- కాజీపేట్, సికింద్రాబాద్-వరంగల్, సి ర్పూర్ టౌన్-భద్రాచలం, వరంగల్- హైదరాబాద్, కరీంనగర్-సిర్పూర్‌టౌన్, కరీంనగర్-నిజామాబాద్, కాజీపేట్-బల్హార్షా తదితర మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
హైదరాబాద్ ట్రాక్షన్ మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి-నాంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఉందానగర్-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మేయింటనెన్స్ పనుల నేపథ్యంలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును 5 నుంచి 10 వరకు వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు రద్దు చేసినట్లు పేర్కొంది.
విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేయగా.. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 9 వరకు రద్దు చేసింది.
లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌లను 10 వరకు రద్దుచేసినట్లు చెప్పింది. తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుందని, విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు కూడా 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్ నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరించింది.