Trisha Krishnan | లియో సినిమాకు త్రిష రెమ్యూనరేషన్‌ అంత తీసుకుంటుందా..? దక్షిణాదిలో హీరోయిన్లలోనే టాప్‌..!

Trisha Krishnan | బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు దాదాపు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్‌ను అందుకుంటున్నారు. దక్షిణాదిలో ఈ విషయంలో హీరోయిన్లు కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో ఎవరు అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారో చెప్పడం కష్టమే. ఇప్పటి వరకు లేడి సూపర్‌స్టార్‌ పేరుపొందిన నయనతార.. సమంతనో కాదు.. సీనియర్‌ నటి త్రిష దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిస్తున్నది. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌తో కలిసి ‘లియో’ చిత్రంలో నటిస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాల […]

Trisha Krishnan | లియో సినిమాకు త్రిష రెమ్యూనరేషన్‌ అంత తీసుకుంటుందా..? దక్షిణాదిలో హీరోయిన్లలోనే టాప్‌..!

Trisha Krishnan |

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు దాదాపు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్‌ను అందుకుంటున్నారు. దక్షిణాదిలో ఈ విషయంలో హీరోయిన్లు కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో ఎవరు అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారో చెప్పడం కష్టమే. ఇప్పటి వరకు లేడి సూపర్‌స్టార్‌ పేరుపొందిన నయనతార.. సమంతనో కాదు.. సీనియర్‌ నటి త్రిష దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిస్తున్నది.

తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌తో కలిసి ‘లియో’ చిత్రంలో నటిస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాల కిందట సినీరంగ ప్రవేశం చేసిన త్రిష టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో అగ్రహీరోయిన్‌గా కొనసాగింది. ప్రస్తుతం సౌత్‌లో అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది.

ఈ సినిమా కోసం చెన్నై బ్యూటీ ఏకంగా రూ.10కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌లో యువరాణి కుందవై పాత్రలో నటించి తన అందంతో అందరినీ ఆకట్టుకున్నది. పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా విజయం తర్వాత రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ఫిన్‌క్యాష్ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

దక్షిణాది సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన త్రిషనే అని ఈ సర్వే తేల్చింది. అయితే, ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌ సిటడెల్‌లో నటిస్తున్నది. ఈ సిరీస్‌కు రూ.10కోట్ల తీసుకుంటోందని టాక్‌. ఇంగ్లిష్‌ వర్షన్‌కు సీక్వెల్‌గా హిందీ వర్షన్‌ వస్తున్నది.

వరుణ్‌ ధావన్‌తో నటిస్తున్నది. ఇదిలా ఉండగా.. త్రిష కొద్ది రోజుల పాటు అడపదడగా సినిమాలు చేసినా ప్రస్తుతం మరోసారి జోరుపెంచింది. 14 ఏళ్ల తర్వాత మరోసారి విజయ్‌తో ‘లియో’లో జతకడుతున్నది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.