Trisha | సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కి అందరిని ఆశ్చర్యపరచిన త్రిష.. కానీ!
Trisha | ఇటీవల అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. కొందరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడుతుంటే, మరి కొందరు పెద్దలు చూసిన వ్యక్తితో ఏడడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సినిమా పరిశ్రమలో కూడా పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఇటీవల బ్రహ్మానందం తనయుడి పెళ్లి అట్టహాసంగా జరగగా, ఈ వేడుకకి సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక త్వరలో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కూడా జరగనుంది. అయితే ఇప్పుడు […]

Trisha |
ఇటీవల అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. కొందరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడుతుంటే, మరి కొందరు పెద్దలు చూసిన వ్యక్తితో ఏడడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సినిమా పరిశ్రమలో కూడా పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఇటీవల బ్రహ్మానందం తనయుడి పెళ్లి అట్టహాసంగా జరగగా, ఈ వేడుకకి సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఇక త్వరలో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కూడా జరగనుంది. అయితే ఇప్పుడు త్రిష పెళ్లి సైలెంట్‌గా జరిగినట్టు వార్తలు వస్తుండడమే కాకుండా పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. త్రిష ఇలా సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కడం వెనక కారణమేంటని పలువురు ముచ్చటించుకుంటున్నారు.
ఇప్పటికే త్రిష ఓ బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం జరుపుకోగా, ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. అనివార్యకారణాల వలన వారి రిలేషన్ బ్రేక్ అయింది. కొద్ది రోజులుగా సింగిల్‌గా ఉంటున్న త్రిష ఇప్పుడు పెళ్లి చేసుకుందనే సరికి అందరు షాకయ్యారు.
అయితే త్రిష పెళ్లి రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో అయింది. జువెలరీ యాడ్ కు సంబంధించిన వీడియోలో త్రిష పెళ్లి చేసుకోగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటహల్‌చల్ చేస్తుంది. అయితే ఒక్కసారిగా యాడ్ కు సంబంధించిన క్లిప్స్ చూసిన అభిమానులు నిజంగానే త్రిష పెళ్లి చేసుకుందేమో అని ఆశ్చర్యానికి గురయ్యారు.
Gorgeous