రాష్ట్రంలో అశాంతి రేపుతున్న‌ టీఆర్ఎస్‌, బీజేపీ: రేవంత్‌రెడ్డి

విధాత‌: రాష్ట్రంలో రెండు పార్టీలు లేని వివాదాలు సృష్టించి తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయ‌ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి దాడులు, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, వివాదాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఔట‌ర్ రింగ్‌రోడ్డును నిర్మించి హైద‌రాబాద్‌ను మ‌హాన‌గ‌రంగా అభివృద్ది చేసి, అంత‌ర్జాతీయ కంపెనీలు హైద‌రాబాద్‌కు వ‌చ్చేలా చేసింద‌న్నారు. ల‌క్ష‌లాధి మందికి ఉద్యోగ, ఉపాధి క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేస్తే, టీఆర్ఎస్‌, బీజేపీలు అభివృధ్దిని పక్కన పెట్టి రాజకీయం […]

  • By: krs    latest    Nov 21, 2022 1:10 PM IST
రాష్ట్రంలో అశాంతి రేపుతున్న‌ టీఆర్ఎస్‌, బీజేపీ: రేవంత్‌రెడ్డి

విధాత‌: రాష్ట్రంలో రెండు పార్టీలు లేని వివాదాలు సృష్టించి తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయ‌ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి దాడులు, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, వివాదాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ ఔట‌ర్ రింగ్‌రోడ్డును నిర్మించి హైద‌రాబాద్‌ను మ‌హాన‌గ‌రంగా అభివృద్ది చేసి, అంత‌ర్జాతీయ కంపెనీలు హైద‌రాబాద్‌కు వ‌చ్చేలా చేసింద‌న్నారు. ల‌క్ష‌లాధి మందికి ఉద్యోగ, ఉపాధి క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేస్తే, టీఆర్ఎస్‌, బీజేపీలు అభివృధ్దిని పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నాయ‌న్నారు.

టీఆర్ ఎస్‌, బీజేపీ కుట్రలకు పెట్టుబడులు రాకుండా పోతున్నాయ‌న్నారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చే పెట్టు బ‌డుల‌ను గుజరాత్‌కు మళ్లించడానికి మోడీ చేస్తున్న కుట్ర అని అన్నారు. ఒకరిపై మరొకరు ప్రభుత్వ రంగ సంస్థలతో దాడులు చేస్తుకుంటూ, అశాంతిని క్రియేట్ చేస్తున్నారు. పంతాలకు పట్టింపులకు తెలంగాణను వేదికచేస్తున్నారు. యువకులు మేధావులు ఆలోచించాలని రేవంత్ కోరారు.

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను పరిశీలించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌న్నారు. గ‌తంలో కూడా ఇలానే చేశార‌ని ఉద‌హార‌ణ‌ల‌తో స‌హా వివ‌రించారు.